తెలుగుదేశం పార్టీ పతనం సుస్పష్టం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభంజనం ముందు 40 ఏళ్ల అనుభవం తోకముడిచింది

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

తాడేపల్లి: నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ పతనం సుస్పష్టంగా కనిపిస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం ముందు 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తోక ముడిచి దాక్కొని ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైయస్‌ఆర్‌ సీపీ.. 151 ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభలో కలిపి 28 ఎంపీలకు చేరుకుందన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై ప్రజలు పెట్టిన నమ్మకమన్నారు. నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసి కూడా చంద్రబాబు దళిత వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దించాడన్నారు. తెలుగుదేశం పార్టీ పతనమైపోయిందనేందుకు అసెంబ్లీ, ఎంపీ స్థానాలు నిదర్శనమన్నారు. పతనానికి చేరిన తెలుగుదేశం పార్టీ.. రాజకీయ క్రీడలు ఆడేందుకు ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుంటుందన్నారు. ఇంట్లో ముసుగు వేసుకొని జూమ్‌ యాప్‌ ద్వారా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెడుతూ ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లుతున్నాడని మండిపడ్డారు. శాసనమండలిలో టీడీపీ దారుణంగా దిగజారిపోయిందని మండిపడ్డారు.  

కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. ధర్మవరంలో ఇచ్చిన మాటకు కట్టుబడి రెండవ విడత నేతన్న నేస్తం పథకం ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ చేనేతలకు ఆర్థికసాయం అందించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమమే వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బడుగు, బలహీనవర్గాలు సీఎం వైయస్‌ జగన్‌ పట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారన్నారు. తొలి సంవత్సరం కాలంలోనే రూ.40 వేల కోట్లతో మూడున్నర కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దని గుర్తుచేశారు. 
 

Back to Top