సీఎం వైయస్‌ జగన్‌ తెగువ, సాహసం మరువలేనిది

కరువు ప్రాంతానికి నీరందించిన అపర భగీరథుడు సీఎం వైయస్‌ జగన్‌

గ్రామ స్వరాజ్యం, సామాజిక న్యాయం దేశానికే ఆదర్శం

వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

సత్యసాయి జిల్లా: కరువు కటకాలతో అల్లాడిపోయే ప్రాంతానికి సాగు, తాగునీరు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటామని రాప్తాడు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గ్రామ స్వరాజ్యం, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధిలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా సొమ్ము (ఖరీఫ్‌–2021) విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఎమ్మెల్యే తోపుదుర్తి ఏం మాట్లాడారంటే..
వైయస్‌ఆర్‌ ఉచిత పంట బీమాకింద జిల్లాకు రూ.900 కోట్లను అందజేస్తూ అందులో రూ.116 కోట్లను రాప్తాడు నియోజకవర్గానికి అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. మా ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన పేరూరు డ్యామ్‌కు హంద్రీనీవా నీరు  అందించిన అపర భగీరథుడు సీఎం వైయస్‌ జగన్‌. చిత్రావతి వరదల్లో చిక్కుకున్న పది మందిని కాపాడేందుకు సీఎం చూపిన తెగువ, సాహసం మరువలేనిది. రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పేరూరు డ్యామ్‌కు నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రూ.800 కోట్ల దుర్వినియోగానికి పాల్పడ్డారు. అందులో నుంచి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు మూడు రిజర్వాయర్లు మంజూరు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు. వైయస్‌ఆర్‌ జలకళ ద్వారా రైతులకు సాగునీరు అందించే కార్యక్రమం చేశారు. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2001లో మూతపడిన రామగిరి బంగారు గనులను మళ్లీ తెరిపిస్తున్నందుకు రుణపడి ఉంటాం. 

గ్రామాలకు స్వరాజ్యం రావాలన్న గాంధీ కలలను నిజం చేశారు. డాక్టర్‌ అంబేద్కర్‌ సామాజిక న్యాయం తీసుకురావాలని కన్న కలలు పుస్తకాలకే పరిమితమైతే.. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపించారు. ఈ దేశ చరిత్రలోనే నిలిచిపోయే పాలన అందిస్తున్నారు.

15 వేల ఇళ్లు ఇచ్చారు. జగనన్న కాలనీల్లో ఆలమూరులో చెన్నై సిల్క్స్‌ సంస్థ 7 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ముందుకువచ్చింది. దానికి అనుమతులు ఇచ్చేసి.. నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాను. రాప్తాడు ఏపీఐఐసీ పార్కులో కొన్ని సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ముందుకువస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీకి అనుమతించాలని, అదేవిధంగా రామగిరి, కనగానిపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు మంచినీటి సౌకర్యం కోసం రూ.20కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాం’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.  

 

Back to Top