రాష్ట్రంలో మిగిలింది ఒకటే జెండా, ఒకటే అజెండా ..

 వైయ‌స్ఆర్ ‌సీపీ ఎమ్మెల్యే రోజా

విజయవాడ: రాష్ట్రంలో ఒకటే జెండా, ఒకటే అజెండా మిగిలాయని.. అమరావతి పేరుతో చంద్రబాబు చేసిన దోపిడీకి ప్రజలు బుద్ధి చెప్పారని వైయ‌స్ఆర్ ‌సీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారని ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం ఆమె  మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు తెలిపారన్నారు.  ‘‘బెజవాడలో పైన అమ్మవారు.. కింద అన్నగారు మాత్రమే ఉన్నారు. 

పవన్ కల్యాణ్‌ పూటకో పార్టీకి మద్దతు ఇచ్చి కార్యకర్తలను అవమానిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఎక్కడైనా దౌర్జన్యంపై పవన్‌ కల్యాణ్ ఫిర్యాదు చేశారా?. రాష్ట్రమంతా కలిపి 19 వార్డులు గెలిచిన పవన్‌కు విమర్శించే అర్హత ఉందా?. అందరికీ మద్దతిచ్చే వారికి పార్టీ ఎందుకు, జెండా ఎందుకు?’’ అని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇక ప్రజలకు ప్రతిపక్షాలతో పని లేదని తేలిపోయిందని ఎమ్మెల్యే రోజా అన్నారు.

Back to Top