గిరిజనులంతా సీఎం జగన్‌ వెంటే

ఎమ్మెల్యే రాజన్నదొర

అసెంబ్లీ: గిరిజనులంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని, ఏడు ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లు ప్రవేశపెట్టిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ.. మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో సీఎం వైయస్‌ జగన్‌ తొమ్మిది కీలక బిల్లులు తీసుకువచ్చారు. ఈ సెషన్‌లో చరిత్రాత్మక దిశ చట్టం, ఈ రోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన వంటి చరిత్రాత్మక బిల్లును తీసుకువచ్చారు. ఇటువంటి బిల్లులు తీసుకువచ్చిన సీఎంకు గిరిజనుల తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్టడుగు, అణగారిన వర్గాల కోసం మహానుభావుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో అనేక అంశాలను పొందుపర్చారు. అవకాశం ఇచ్చారు.. హక్కులు, రిజర్వేషన్లు కల్పించారు. అవన్నీ సక్రమంగా అమలు జరగలేదు. గతంలో గిరిజన శాఖ మంత్రిని నియమించాలని ఇదే సభలో అడిగాను.. చివరి నిమిషంలో ఇచ్చారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే గిరిజన మహిళకు గిరిజన సంక్షేమ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.

ఇదే శాసనసభకు సంబంధించి స్పీకర్‌ ఆదేశాల మేరకు మూడు కమిటీల్లో గిరిజనులకు ప్రాధాన్యత కల్పించారు. నేను అంటే రాజన్నదొరకు అంచనాల కమిటీ చైర్మన్,  గిరిజన సంక్షేమ కమిటీ తెల్లం బాలరాజుకు, మహిళా కమిటీ కళావతికి, ఇవి కాకుండా నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం అవరాశం కల్పించారు. ఎస్టీ రిజర్వుడ్‌ ఏడు శాసనసభ నియోజకవర్గాలు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచారు.

ఎస్టీ కమిషన్‌ గురించి 2009లోనే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని గిరిజన సభ్యులంతా కోరినప్పుడు తప్పకుండా విభజిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఆయన మరణించారు. ఆ తరువాత 19–06– 2013లో ఇదే బిల్లు ప్రవేశపెట్టారు.  రాష్ట్ర విభజన జరిగి బిల్లు ఆగిపోయింది. ఇంత జరిగిన తరువాత కూడా 2014లో తెలుగుదేశం మేనిఫెస్టో గిరిజనులకు ప్రత్యేక కమిషన్‌ అని మేనిఫెస్టోలో పెట్టారు.. ఐదేళ్లలో అమలుకు నోచుకోలేదు. 2019 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలో పెట్టకపోయినా సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లు తీసుకువచ్చారు. గిరిజనుల ఆస్తులు, భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. అత్యాచారాలు, అవమానాలు పెరిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో.. గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా.. హక్కులను లాక్కోవడానికి ప్రయత్నం చేసినా వెంటనే కమిషన్‌ కలగజేసుకొని న్యాయం చేస్తుంది. అందుకే ఈ రోజు ప్రవేశపెట్టిన గిరిజన కమిషన్‌ చాలా అవసరం. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన బిల్లును ప్రవేశపెట్టిన సీఎంకు కృతజ్ఞతలు అంటూ ఎమ్మెల్యే రాజన్నదొర తన ప్రసంగాన్ని ముగించారు.

 

Back to Top