దళిత ఎమ్మెల్యేని అవమానిస్తారా..?

దీనికి చంద్రబాబు  ఏం సమాధానం చెబుతారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, సుధాకర్‌బాబు

 తాడేపల్లి: అంబేడ్కర్‌ ఆలోచన విధానాలకు తిలోదకాలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని, దళితులను చిన్నచూపు చూస్తే వారిపై దాడులు చేయిస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. దళితుల్లో ఎవరూ పుడతారని అవమానించేలా చంద్రబాబు గతంలో మాట్లాడారని గుర్తుచేశారు. ఈరోజుకీ చెంపలు వేసుకోలేదు. అందుకు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాడన్నారు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా చంద్రబాబులాగే ఆయన పార్టీ నాయకులు గతంలో మాట్లాడారన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు వేసిన విష నాగులు ఆ ప్రాంత శాసనసభ్యురాలు విరుచుకుపడుతున్నాయని మేరుగు మండిపడ్డారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  వినాయకుడి పూజకు వెళ్తే దేవుడు మైలపడుతాడని టీడీపీ నేతలు దుర్భాషలాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మీద అవాకులు పేలుతూనే మళ్లీ కులరక్కసిని చంద్రబాబు ప్రజల్లోకి పంపిస్తున్నాడని మేరుగు మండిపడ్డారు. దళిత శాసనసభ్యురాలిని అవమానిస్తారా..? గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేదని, అంబేడ్కర్‌ విగ్రహాలు పెడుతుంటే ఎలివేతలు, దాడులు చేయించాడని గుర్తుచేశారు. దళిత మహిళను వివస్త్రను చేసినా చంద్రబాబు ఏం మాట్లాడలేదన్నారు. భారతదేశంలో దళితులపై జరిగిన దాడుల్లో ఏపీ నాల్గవ స్థానంలో ఉందని ఎన్‌సీఆర్‌బీ చంద్రబాబు హయాంలో రిపోర్టు ఇచ్చిందని గుర్తుచేశారు. దళిత ఎమ్మెల్యేను అవమానించిన ఘటనలో నలుగురు టీడీపీ నేతలే కాకుండా బాధ్యుడు చంద్రబాబు అన్నారు. చట్టాలు తీసుకువచ్చి సీఎం వైయస్‌ జగన్‌ ఆంధ్రరాష్ట్ర ప్రజలందరికీ చుట్టం అయిపోతున్నాడని చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నాడన్నారు.  

Back to Top