చట్ట ప్రకారమే ‘నారాయణ’ అరెస్టు 

తప్పు చేసినవారికి చట్టపరమైన చర్యలు తప్పవు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

తాడేపల్లి: నారాయణ విద్యా సంస్థల నుంచే పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైనట్టుగా తేలిందని, చట్టప్రకారమే మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్టు చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తప్పు చేసిన వారికి నోటీసులు ఇవ్వాల్సిన పనేంటని, నారాయణ ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లారన్నారు. రూల్స్‌ ప్రకారమే పోలీసులు నారాయణను అరెస్టు చేశారని చెప్పారు. తాడేపల్లిలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. 

పేపర్‌ లీకేజీ గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మాట్లాడిన టీడీపీ నేతలు.. లీకేజీకి కారణమైన విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేస్తే వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రెండు, మూడు నాల్కల ధోరణిలో టీడీపీ వ్యవహరిస్తోందని, ఇది సరైన విధానం కాదన్నారు. తప్పు చేసినవారు ఎవరైనా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. తిరుపతి నారాయణ విద్యా సంస్థల నుంచే ప్రశ్నాపత్రాలు లీకైందని, గిరిధర్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ నుంచి లీకైనట్టుగా తేలిందని చెప్పారు. 
 

Back to Top