రైతులపై కాల్పులు జరిపించిన ఉన్మాది చంద్రబాబు

బషీర్‌బాగ్‌ ఘటనకు రేపటితో 21 సంవత్సరాలు 

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దెబ్బ‌కు బాబుకు మ‌తిభ్ర‌మించింది

ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేని నీచుడు చంద్రబాబు

ప్రభుత్వ పథకాలు అడ్డుకునేందుకు నిత్యం టీడీపీ కుట్రలు

బాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే ఢిల్లీ వీధుల్లో ధర్నా చేయాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల్లో చావుదెబ్బ తిన్న  చంద్రబాబు, మతిభ్రమించి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని బషీర్‌బాగ్‌లో చేపట్టిన రైతులపై పోలీసులతో చంద్రబాబు కాల్పులు జరిపించి రేపటికి 21 సంవత్సరాలు అని గుర్తుచేశారు. మొదటి నుంచీ చంద్రబాబు రైతు వ్యతిరేకిగా, ప్రజా వ్యతిరేకిగానే ఆలోచన చేశాడని, ప్రజలకు మేలు జరుగుతుంటే జీర్ణించుకోలేడని ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్‌లో ఆ రోజు పోలీసులతో రైతుల కాల్పులు జరిపించిన ఘటన ఈ రోజుకీ రైతులు మర్చిపోలేదన్నారు. అధికారం కోల్పోయిన తరువాత రాష్ట్రాన్ని, ప్రజలను వదిలి హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబు.. జూమ్‌ యాప్‌ ద్వారా కాలం వెల్లదీస్తున్నాడన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప కార్యక్రమాలను ప్రపంచంలోని మేధావులు మెచ్చుకుంటున్నారు. అయితే, వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకోవాలని ఆలోచన చేస్తున్న నీచుడు చంద్రబాబు. బహుశా రాజకీయాల్లో ఇలాంటి నీచ మనస్తత్వం ఉన్నవారు ఎవరూ ఉండరేమో.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశానని జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రజలకు ఇంత మేలు జరుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నాడు. తనకున్న టక్కుటమారాలతో కేంద్రానికి కంప్లయింట్‌ చేస్తున్నాడు. తన లాయర్లతో, పచ్చ పత్రికలతో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను నిలిపివేయాలని కోర్టులో కేసు వేయించే దుస్థితికి, దౌర్భాగ్యానికి చంద్రబాబు దిగజారిపోయాడు. చంద్రబాబు తీరు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. 

చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తరువాత ఏపీ ప్రజలను గాలికొదిలేసి పారిపోయి హైదరాబాద్‌లో దాక్కున్నాడు. అధికారం ఉన్నప్పుడు తన పాపాల నుంచి తప్పించుకోవడానికి పది సంవత్సరాల రాజధాని హైదరాబాద్‌ను వదిలి పిరికిపందలా పారిపోయి ఏపీకి వచ్చాడు. ఓడిపోయిన తరువాత రాష్ట్రంతో, ప్రజలతో సంబంధం లేదని హైదరాబాద్‌లో దాక్కొని జూమ్‌లో మాట్లాడుతు కాలం గడుపుతున్నాడు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి సెస్‌ పెంచితే దాని మీద హైదరాబాద్‌లో ధర్నాలో చేస్తాడంట. చంద్రబాబు ఐదేళ్లలో చేసిన రూ.2.5 లక్షల అప్పు చేసి దాంట్లో 10 పైసల వంతు కూడా ప్రజలకు చేరనివ్వలేదు. టీడీపీ హయాంలో అవినీతి ద్వారా పనికిరాని కార్యక్రమాలకు ఖర్చుపెట్టి.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినదానిపై ధర్నా చేస్తాడా..? అధికారంలో ఉన్నప్పుడు డీజిల్, పెట్రోల్‌ మీద ఎంత ధరలు పెరిగాయో ఎప్పుడైనా చంద్రబాబు ఆలోచించాడా..? దాదాపు రూ.25 నుంచి రూ.30 వరకు ధరలు పెరిగినప్పుడు చంద్రబాబు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు. కనీసం ఎప్పుడూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదు. ఎవరి మీద ధర్నా చేయబోతున్నావ్‌ చంద్రబాబూ.. ఏపీ ప్రభుత్వ మీదనా.. లేక తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మీదనా..? నిజంగా దమ్ము ఉంటే పాత నల్లచొక్కాల దుమ్ము దులిపి ఢిల్లీ వీధుల్లో మోడీ ప్రభుత్వం మీద చంద్రబాబు ధర్నా చేయాలి’ అని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్‌ చేశారు. 
 

Back to Top