తురకపాలెంలో టీడీపీ నేతల దౌర్జన్యం 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడి

గాయపడినవారిని పరామర్శించిన ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి

 

గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పద్ధతి మార్చుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి సూచించారు. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం తురకపాలెంలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. టీడీపీ నేతల దాడిలో వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని ధ్వజమెత్తారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Back to Top