ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలి

 వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి 
 

అమరావతి :   ఏనుగుల దాడి నుంచి గిరిజనులను రక్షించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి  విజ్ఞప్తి చేశారు. సోమ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఆమె మాట్లాడుతూ..గత ఐదేళ్ల కాలంలో గిరిజనలు ఆదుకునే నాధుడే లేరని ఆరోపించారు. ఏనుగుల దాడిలో ఎంతో మంది గిరిజనులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏనుగులు గ్రామాలలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు కోరారు. సభ్యుల విజ్ఞప్తిపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లను జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. 11 మంది బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చామని వెల్లడించారు. ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. 

Back to Top