ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండాలి

అధికారుల‌కు ఎమ్మెల్యే శ్రీ‌మ‌లి జొన్న‌లగ‌డ్డ ప‌ద్మావ‌తి ఆదేశం

అనంత‌పురం: భారీ వర్షాల కార‌ణంగా పొంగి పొర్లుతున్న బుక్కరాయసముద్రం, శింగనమల చెరువులను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీ‌మతి జొన్నలగడ్డ పద్మావతి ప‌రిశీలించారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అధికారుల‌కు సూచించారు. ఎలాంటి అపాయం లేద‌ని, అధికారులు అందుబాటులో ఉంటార‌ని, ఏ స‌మ‌స్య ఎదురైనా వెంట‌నే అధికారుల‌కు తెలియ‌జేయాల‌ని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

Back to Top