చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే..

అయ్యన్నపాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది బాబే

నిరసన తెలిపేందుకు వెళ్తే.. గూండాలు, రౌడీలతో నాపై దాడి చేయించాడు

చంద్రబాబుకు వత్తాసు పలికే విధంగా పచ్చపత్రికల కథనాలు

బాబుది దండయాత్రా.. లేక నాది దండయాత్రా..? 

ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడితే ఊరుకోం..

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరిక

తాడేపల్లి: రాష్ట్రంలో అరాచకాలు, అల్లర్లు సృష్టించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని, అయ్యన్న పాత్రుడి మాటలకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ మొత్తం చంద్రబాబేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గురించి గొప్పగా చెప్పుకుంటుంటే.. అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, మంత్రి వర్గ సభ్యులను, దళిత మహిళా హోంమంత్రిని కూడా బండభూతులు తిడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి మాటలను తీవ్రంగా ఖండిస్తూ.. శాంతియుత నిరసన తెలియజేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లకముందే.. కరకట్ట మీద గూండాలు, రౌడీలు, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ గ్యాంగ్‌ను పెట్టుకొని తనపై, తన అనుచరులపై చంద్రబాబు దాడి చేయించాడని ఫైరయ్యారు. అయ్యన్న మాటలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యే జోగి రమేష్‌ డిమాండ్‌ చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘‘తెలుగుదేశం పార్టీ తాబేదారు పచ్చ పత్రికలు కూడబలుక్కొని ‘చంద్రబాబు ఇంటి మీద దండయాత్ర’ అనే హెడ్డింగ్‌లతో బాబుకు వత్తాసు పలికారు. కనీసం పశ్చాతాపం కూడా లేదు. సభ్యసమాజం తలదించుకునే విధంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడారు. కనీసం పచ్చపత్రికలు కూడా రాయలేని భాషలో మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి మాటలను ఖండిస్తూ నిరసన తెలియజేయడానికి చంద్రబాబు ఇంటికి వెళ్లకముందే నా కారు మీద రాళ్లు వేశారు. కారు దిగకముందే.. కారు అద్దాలు పగులగొట్టారు. నాపై, నా అనుచరులపై దాడి చేశారు. నేను దండయాత్ర చేయడానికి వెళ్లానా..? విన్నపం, విజ్ఞాపన చేయడానికి వెళ్లాను. దండయాత్ర చేస్తే నా వెంట గూండాలు ఉన్నారా..? 

చంద్రబాబు నాయుడు కరకట్ట మీద గూండాలు, రౌడీలను, బుద్ధా వెంకన్న లాంటి కాల్‌ మనీ సెక్స్‌రాకెట్‌ గ్యాంగ్‌ను పెట్టుకున్నారు. పట్టాభి లాంటి పందికొక్కులను, గన్నె నారాయణ ప్రసాద్‌ లాంటి రౌడీషీటర్లను, గద్దె రామ్మోహన్, నాగూల్‌ మీరా, బ్రహ్మం చౌదరి లాంటి వాళ్లను పెట్టుకొని కారు అద్దాలు ధ్వంసం చేయించాడు. ముఖ్యమంత్రిని బండభూతులు తిడుతుంటే చూసి ఓర్చుకోలేని పరిస్థితుల్లో నిరసన తెలియడానికి చంద్రబాబు ఇంటికి వెళ్తుంటే.. రాళ్లు వేయించి, కారు ధ్వంసం చేయించి, నాపై దాడి చేయించాడు. చంద్రబాబుది దండయాత్రా.. లేక నాది దండయాత్రా..? 

రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చంద్రబాబు చేస్తున్న వైనాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. బలహీనవర్గానికి చెందిన నాపై దాడి చేయించి.. కారు అద్దాలు పగులగొట్టి, కార్యకర్తలను కొట్టించారు. ఇంత దుర్మార్గంగా టీడీపీ వ్యవహరిస్తుంటే.. పచ్చపత్రికలు మాత్రం చంద్రబాబు మీదకు దండయాత్ర అంటూ బాబుకు వత్తాసు పలుకుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబుకు బుద్ధిరావాలి. అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటల మీద చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే. సభ్యసమాజం తలదించుకునే విధంగా అయ్యన్న మాట్లాడిన మాటలు, 

రెచ్చగొట్టే కార్యక్రమానికి టీడీపీ తెరతీస్తుంది. దీన్ని మార్చుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు చెంపచెల్లుమనించేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. దీన్ని జీర్ణించుకోలేక.. పెడదారి పట్టించాలనే ఆలోచనలతో డ్రామాలు చేస్తున్నారు. మరోసారి హెచ్చరిస్తున్నాం. బుద్ధిని, భాషను సరిచేసుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే అక్కడ నిరసన తెలియజేస్తాం. భాషను సరిచేసుకునే వరకు వెంటపడతాం. నిన్న జరిగింది ఆరంభం మాత్రమే..’’ అని హెచ్చరించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top