తీరు మార్చుకోకపోతే తరిమి తరిమి కొడతాం

చంద్రబాబు, టీడీపీ నేతలకు ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరిక

సీఎంపై నోరుపారేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సంఘటితమవుతాం

తెలుగుదేశం వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే నీకెందుకంత కోపం బాబూ..?

మానసిక రోగిలా, ఉగ్రవాదిలా, ఉన్మాదిలా చంద్రబాబు ప్రవర్తన

మానవత్వానికి ప్రతిబింబం సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనార్టీలు తలెత్తుకొని జీవించేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలన సాగుతోంది. మానవత్వానికి ప్రతిబింబమైన సీఎం వైయస్‌ జగన్‌పై మతం ముద్ర వేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. మానసిక రోగిలా, ఉగ్రవాదిలా, ఉన్మాదిలా చంద్రబాబు మాట్లాడుతున్నాడు. నోరు అదుపులో పెట్టుకోకపోతే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంఘటితమై.. చంద్రబాబు, ఆయన తాబేదారులను రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ హెచ్చరించారు. రాష్ట్రమంతా ఇళ్ల పట్టాల పండుగ సంబరంగా జరుగుతుంటే ఎందుకంత కడుపు మంట అని చంద్రబాబును ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

చంద్రబాబు మానసిక రోగిలా, ఉగ్రవాదిలా, ఉన్మాదిలా రెచ్చిపోయి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు పడే తాపత్రయం అంతా ఇంతా కాదని, అమరావతి పేరుతో సంవత్సరం పాటు పెయిడ్‌ ఆర్టిస్టులు, పెయిడ్‌ మీడియా ఛానళ్లు, పత్రికలతో.. ఒక పెయిడ్‌ ఉద్యమాన్ని నడిపాడన్నారు. ఆ పెయిడ్‌ ఉద్యమం ఫెయిల్‌ అయిందని మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొత్త కుట్రకు తెరతీశాడని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. 

తమ సొంతింటి కల నెరవేరిందని, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జగనన్న తమ సొంతింటి కలను నిజం చేశారని 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలు పండుగ చేసుకుంటున్నారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. 1.24 కోట్ల మంది పండుగ చేసుకుంటున్న సందర్భంలో అక్కసుతో దుర్మార్గుడిలా, రాక్షసుడిలా, శిఖండిలా.. చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై మతం ముద్ర వేయడానికి ఉన్మాదిలా, ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయిందని, ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. ఎందుకు ముఖ్యమంత్రిపై నీకంతా కోపం చంద్రబాబూ అని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు ఏమీ లేక.. మతాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మత చిచ్చును ప్రేరేపిస్తున్నాడని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉన్న పార్టీ. అసలు టీడీపీకి ఉనికి ఉందా..? అని ప్రశ్నించారు. 

కరోనా వచ్చిందని రాష్ట్రాన్ని, ప్రజలను వదిలిపారిపోయిన చంద్రబాబు, లోకేష్‌ మళ్లీ వచ్చి చిచ్చుపెట్టే కార్యక్రమానికి తెరతీశారని మండిపడ్డారు. కులం, మతం, పార్టీ, జెండా ఏదీ లేకుండా.. పేదలకు మంచి చేయాలనే ఎజెండాను ఎత్తుకొని సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రిపై మతం ముద్ర వేయాలని చూస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరన్నారు. అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌దన్నారు. ఏ మతానికి ఎక్కడ అన్యాయం జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు సీఎం ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. 

టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్‌ వాళ్ల అంతుచూస్తా.. నక్సలేట్‌ ఏరియాలో వేస్తానని సొల్లు దేవినేని ఉమా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేది నరకంలో మాత్రమేనని, బాబు చేసిన పాపానికి నరకమే గతి అని ఎద్దేవా చేశారు. మీడియా ముందు తప్ప మీ పార్టీ ప్రజల్లో ఉందా..? అని చంద్రబాబు అండ్‌ కోను ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ చేసే ప్రతి కుట్రను అరికడతామని, దేవుడు మళ్లీ మీకు ప్రజల చేత గుణపాఠం చెప్పిస్తారని అన్నారు. 

 

Back to Top