రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల రేటింగ్‌ సున్నా..

తండ్రీకొడుకులు ఎవరికైనా రేటింగ్‌లు ఇచ్చుకుంటూ బతకాల్సిందే

రూ.25 లక్షల తిండి తిన్నాడని పేపర్లలో రాస్తే లోకేష్‌కు కోపం వచ్చిందా..?

ఐఎన్‌ఎస్‌ విశాఖ యుద్ధనౌకను సీఎం వైయస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం చేపల బోటు అయినా అంకితం చేశాడా..?

తండ్రీకొడుకులు తిరిగిన దేశాలెన్నీ, మీ ముఖాలు చూసి వచ్చిన పెట్టుబడులెన్నీ..?

రెండు ఎకరాల మీ ఆస్తి.. రూ.లక్షల కోట్లకు ఎలా చేరిందో సమాధానం చెప్పగలవా..?

నీ బాబాయి రామ్మూర్తి నాయుడుపై పిచ్చివాడి ముద్రవేసి చైన్లతో ఎందుకు కట్టేశారో సమాధానం చెప్పాలి..?

వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీ తండ్రీకొడుకులకు లేదు

లోకేష్‌పై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్‌ల రేటింగ్‌ సున్నా. తండ్రీకొడుకులు ఎవరికైనా రేటింగ్‌లు ఇచ్చుకుంటూ బతకాల్సిందే తప్ప వారికి రాష్ట్ర ప్రజలు రేటింగ్‌ ఇచ్చే పరిస్థితి లేదని అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎవరితో పొత్తు, మద్దతు లేకుండా పోటీ చేసే సత్తా ఉందా అంటే సమాధానం లేదు కానీ, ఎయిర్‌పోర్టులో ఇంత తిన్నావని పేపర్లలో రాస్తే లోకేష్‌కు కోపం వస్తుందా..? అని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో చిరుతిండి ఖర్చు రూ.25 లక్షలు మాత్రమే రాశారు.. ఐదేళ్లు అధికారంలో ఉండి చేసిన దోపిడీ గురించి రాయలేదనే బాధ లోకేష్‌లో కనిపిస్తుందన్నారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..  
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్‌ విశాఖ వచ్చి ఎయిర్‌పోర్టులో వారు తిన్న చిరుతిండికి రూ.25 లక్షలు ఖర్చు అయినట్టు బిల్లులు వివరాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఉలిక్కిపడి లోకేష్‌ కేసు వేసినట్టుగా చూశాం. నేను నా తండ్రి రాష్ట్రమంతా దోచుకుతింటే కేవలం రూ.25 లక్షలు మాత్రమే తిన్నామని రాసినందుకు లోకేష్‌కు కోపం వచ్చినట్టుగా కనిపిస్తుంది. విశాఖ నగరంలో లక్షల కోట్ల రూపాయలు విలువైన భూముల స్కామ్‌లు చేశారు. ఐదేళ్లు చేసిన దోపిడీని ఎందుకు ప్రస్తావించలేదు అని లోకేష్‌ బాధపడినట్టుగా కనిపిస్తుంది. 

విశాఖ సాగర తీరంలో జరిగిన మిలాన్‌ 2022కి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అది చూసిన తరువాత లోకేష్‌ మెదడు పనిచేయడం లేదేమో..! ప్రపంచ వ్యాప్తంగా 39 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వారితో సీఎం వైయస్‌ జగన్‌ గౌరవ వందనం స్వీకరించారు. 75 సంవత్సరాల స్వతంత్య్ర భారతదేశంలో నేవీకి సంబంధించిన ఐఎన్‌ఎస్‌ విశాఖ పేరుతో యుద్ధనౌకను జాతికి అంకితం చేసే గొప్ప అవకాశం పొందిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం చేపల బోట్‌ అయినా అంకితం చేశాడా..? 39 గ్రామాల నుంచైనా మీ తండ్రీకొడుకులకు గౌరవం ఇవ్వడానికి ముందుకు వచ్చారా..? 

లోకేష్‌ దేశాలన్నీ తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాడట.. ఈరోజు అవన్నీ తరలిపోతున్నాయని విషప్రచారం చేస్తున్నాడు. దావోస్, దుబాయి పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్‌ తిరిగిన దేశాలెన్నీ, మీ ముఖాలు చూసి వచ్చిన పెట్టుబడులెన్నీ..? పాట్నర్‌ షిప్‌ సమ్మిట్‌ల పేరుతో వందల కోట్ల ప్రజాధానం లూటీ చేసి ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేశారు. రాష్ట్రానికి చంద్రబాబు, లోకేష్‌ చేసిన మేలు ఏమీ లేదు. 

విశాఖకు వచ్చి ఎయిర్‌పోర్టులో రూ.25 లక్షల తిండి తినేసి ఆరోజు నేను లేను. ఆ బిల్లు నాది కాదనిలోకేష్‌ బుకాయిస్తాడు. మీరు వచ్చినరోజే బిల్లు పెట్టడానికి ఇదేమీ హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌ కాదు కదా..? వచ్చి వెళ్లిన నాలుగు ఐదు రోజులకు అధికారులు బిల్లు పెడతారు. ఆరోజు నేను రాలేదు, రాష్ట్రంలో లేను, దేశంలో లేను అని బుకాయిస్తున్నాడు. 

చంద్రబాబు సంపాదించిన అక్రమ ఆస్తుల మీద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ కోర్టులో కేసు ఫైల్‌ చేస్తే స్టేతెచ్చుకుంది మీ తండ్రి చంద్రబాబు కాదా.. మీ కుటుంబం కాదా..? నీ తండ్రి అత్తగారు లక్ష్మిపార్వతి మీ అక్రమ ఆస్తులపై కేసు వేస్తే దాని మీద కూడా స్టే తెచ్చుకున్నారు. రెండెకరాల పొలం కలిగిన నీ తండ్రి ఆస్తి.. లక్షల కోట్ల రూపాయలు విలువైన సంపదగా ఎలా మారిందో దాని మీద సీబీఐ ఎంక్వైరీ అడిగినప్పుడు ఏరోజూ మాట్లాడలేదే.. కోర్టులో కేసులు వేస్తే ఎందుకు ధైర్యంగా ఎదుర్కోలేదు. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ నీ కుటుంబం మీద ఏరకమైన ఎంక్వైరీ జరగకుండా చేసుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి..? రెండు ఎకరాల ఆస్తి కలిగిన నీ కుటుంబం.. లక్షల కోట్ల రూపాయల విలువైన సంపదగా ఎలా మారిందో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా లోకేష్‌..?

ముఖ్యమంత్రిని, వారి కుటుంబాన్ని విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు. సీఎం వైయస్‌ జగన్‌ బాబాయి వైయస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతున్నారు. ఆ కేసు సీబీఐ విచారణలో ఉంది. మరి మీ తండ్రి సొంత తమ్ముడు, మీ బాబాయి రామ్మూర్తి నాయుడు సంగతేంటీ..? ఎక్కడ దాచిపెట్టారు..? ఎందుకు ఈరోజుకీ ఆయన్ను బయటకు రానివ్వకుండా చేస్తున్నారు..? పిచ్చివాడి ముద్రవేసి నీ బాబాయిని చైన్లతో ఎందుకు కట్టేశారో సమాధానం చెప్పాలి..? 

వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ వివేకానందరెడ్డి రామలక్ష్మణుల్లా ఉన్నారు. అలాంటి సోదరుల గురించి విమర్శించే స్థాయికి టీడీపీకి లేదు. లోకేష్‌ బాబు ఎవరి వారసుడివో చెప్పాలని ప్రెస్‌మీట్‌లో ప్రశ్న వేస్తే ఇంత వరకు సమాధానం చెప్పలేదు. లోకేష్‌ ఎన్టీఆర్‌ వారసుడు కాదు.. ఎన్టీఆర్‌ను చంపిన వ్యక్తికి వారసుడివి. నీ తండ్రికి తండ్రి అయిన ఖర్జూరనాయుడు వారసుడివి అని చెప్పుకోవాలి. ఆ ధైర్యం లేదు. వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని, వైయస్‌ఆర్‌ సీపీని విమర్శించేస్థాయి మీ తండ్రీకొడుకులకు ఉందా..? 

రీమేక్‌ సినిమాలకు తండ్రీ కొడుకులు రేటింగ్‌లు ఇస్తున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా బాగుందని ఏనాడైనా ట్వీట్లు వేశారా..? మీ మామ బాలకృష్ణ సినిమా అఖండ  బాగుందని ట్వీట్లు వేశావా..? 

Back to Top