తండ్రిని మరిపించేలా పాలన చేస్తారు

వైయస్‌ జగన్‌ ప్రభంజనంతో ప్రతిపక్షాలు గల్లంతు

బాబులా మోసం చేయడం సీఎం వైయస్‌ జగన్‌కు తెలియదు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే, విప్‌ దాడిశెట్టి రాజా

తుని: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మరిపించేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆంధ్రరాష్ట్రాన్ని పరిపాలిస్తాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభంజనంలో ప్రతిపక్ష పార్టీలు అడ్రస్‌ లేకుండా గల్లంతయ్యాయన్నారు. తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. విప్‌గా తనకు బాధ్యతలు అప్పగించారని, తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తుని నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలన చూసి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఆఖరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గొప్పగా పాలిస్తున్నాడని మెచ్చుకుంటున్నారన్నారు. తండ్రి వైయస్‌ఆర్‌ను మరిపించేలా పాలన చేస్తాడని, చంద్రబాబులా మోసం చేయడం సీఎం వైయస్‌ జగన్‌కు రాదు.. తెలియదన్నారు. 
రెండు అడుగులు ముందుకేశారు..
3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలన్నీ కళ్లారా చూశారని, నేను విన్నాను.. నేను ఉన్నానని ప్రజలందరికీ భరోసా కల్పిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనం రూ. 10 వేలకు పెంచారన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుతినడానికే సమయం వెచ్చించాడన్నారు. కానీ, వైయస్‌ జగన్‌ ప్రజా సంక్షేమం కోసం వైయస్‌ఆర్‌ ఒక అడుగు ముందుకు వేస్తే సీఎం వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేసి పాలన చేస్తున్నారన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top