నాపై హత్యాయత్నానికి రెక్కీ...

ఆధారాలతో సహా మీడియాకు వివరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
 

తిరుపతి: నాపై హత్యాయత్నానికి రెక్కీ జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అన్నారు. తనను హత్య చేయడానికి నిర్వహించిన రెక్కీ వివరాలను ఆధారాలతో సహా మీడియాకు వివరించారు. ఎన్నికల కోసం 43 వాహనాలను అద్దెకు తీసకున్నామన్నారు. నాకు తెలియకుండా డ్రైవర్లుగా ఇద్దరు కొత్త వ్యక్తులను తీసుకొచ్చారన్నారు.ఈ ఇద్దరు వ్యక్తులు చంద్రగిరి టీడీపీ ఇంఛార్జ్‌ పులివర్తి నాని పంపిన మనుషులు అని తెలిపారు.నా దగ్గర కారు డ్రైవర్లుగా నెల క్రితం చిత్తూరుకు చెందిన నాగభూషణం,సిసీంద్రీలు చేరారన్నారు.ఒకొక్కరికీ రూ.15 లక్షల చొప్పున ఒప్పందం కుదిరిందన్నారు.పులివర్తి నాని పంపితేనే మేం చెవిరెడ్డి వద్ద కారు డ్రైవర్లుగా చేరామని వారు తెలిపారన్నారు.

నా  దైనందిక కార్యక్రమాలపై నిఘా పెట్టారన్నారు. తిరుపతిలో ఇలాంటి సంస్కృతి లేదన్నారు.ఎవరితోనూ వ్యక్తిగతంగా వివాదాలు లేవన్నారు.పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటివి జరగడం భాధాకరమన్నారు.

Back to Top