చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో సీఎం మార్పు తెస్తున్నారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి
 

 

వెలగపూడి: చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్పు తీసుకువస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభలో ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ.. ప్రతిపక్షం నుంచి ఎవరైనా అధికార పక్షంవైపు వచ్చే ప్రయత్నం చేస్తే అనర్హత వేటు పడుతుందని ఫిరాయింపుల చట్టం వచ్చిన తరువాత చెప్పిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రతిపక్షం చాలా భద్రంగా ఉండే అవకాశాన్ని సీఎం కల్పించారన్నారు. విలువలు, ఆదర్శాలకు సమున్నతమైన పీట వేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉండంగా.. ప్రతి రోజూ తన రాజకీయ ప్రసంగాల్లో చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పుతీసుకురావాలని చెప్పారని, అది ముఖ్యమంత్రిగా ఆచరణకు తీసుకువస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి పార్టీలోకి చేరాలనుకునే వ్యక్తులను రాజీనామాలు చేపించి చేర్చుకున్నారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top