సీఎంగా కొనసాగే హక్కు చంద్రబాబుకు లేదు

ఎన్ని కుట్రలు పన్నిన ప్రజలందరూ వైయస్‌ జగన్‌ వైపే..

టీడీపీకి ఏపీ ప్రజలు బుద్ధి చెబుతారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా

వైయస్‌ఆర్‌ జిల్లా: దొంగతనం చేసి దొంగే దొంగా.. అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా అన్నారు.కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్టవ్యాప్తంగా సర్వేల ద్వారా వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే పనులు చేస్తున్నారన్నారు.హైదరాబాద్‌ నుంచి రాజీపడి వచ్చానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిందని ధ్వజమెత్తారు.రహస్యమైన డేటా ఐటి గ్రిడ్‌ కంపెనీకి ఏవిధంగా చేరిందో సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని చట్టాలు  చెబుతున్నాయన్నారు.ఐటి గ్రిడ్‌ సంస్థ ఎండి∙లోకేష్‌కు అతి సన్నిహితుడన్నారు.

బ్లూప్రాగ్స్‌  ఐటి కంపెనీకి చెందిన అశోక్‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.విచారణకు సహకరించకుండా అశోక్‌ ఎక్కడ దాకున్నారని ప్రశ్నించారు. ప్రజలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉందన్నారు. తప్పు చేయలేనప్పుడు ఎందుకు పరారీ లో ఉండాలి అని ప్రశ్నించారు.అన్ని నియోజకవర్గాల్లో వైయస్‌ఆర్‌సీపీ పార్టీకి చెందినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఒక ఆధారం కూడా బయట పెట్టలేకపోయారన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగే హక్కు లేదన్నారు. ప్రజలందరూ టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీకి చెందిన ఓట్లను తొలగిస్తే మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నిన కూడా వైయస్‌ జగన్‌ వైపే రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారని తెలిపారు. 

Back to Top