ప‌వ‌న్‌..ద‌మ్ముంటే  బీజేపీని ప్ర‌శ్నించు

 వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ఆస్తి

పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నది కేంద్రం

విశాఖ ఉక్కు పరిశ్రమపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంది.

ఈ దీక్ష సీఎంను నిందించడం కోసం చేశావా?

తాడేప‌ల్లి: విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడంలో ఆంతర్యమేమిటని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ద‌మ్ముంటే బీజేపీని ప‌వ‌న్ ప్ర‌శ్నించాల‌ని స‌వాలు విసిరారు. అంబ‌టి రాంబాబు తాడేపల్లిలోని వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రం అమ్మకానికి పెట్టడంపై వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తూనే ఉంది.

 
పవన్‌ పోరాటం చేయాల్సింది బీజేపీతో. పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ కార్యాలయం ఎదుట ప్లకార్డు పట్టుకుని పోరాటం చేసే దమ్ముందా?’ అని నిప్పులు చెరిగారు. పార్ట్‌నర్‌(బీజేపీ)ను నిలదీయలేని పవన్‌ కల్యాణ్‌కు.. సీఎం వైయ‌స్‌ జగన్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల కోసం రాజకీయం చేస్తున్నావా.. లేక సీఎం వైఎస్‌ జగన్‌ను నిందించడం కోసం రాజకీయాలు చేస్తున్నావా.. చెప్పాలని నిలదీశారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

పార్లమెంట్‌లో పోరాటం కనిపించలేదా?
► ప్రత్యేక హోదా అంటూ నిన్న బాబు మాట్లాడితే.. ఇవాళ విశాఖ ఉక్కు దీక్ష పేరుతో పవన్‌ కల్యాణ్‌ మరో నాటకం ఆడారు. కేంద్రాన్ని నిలదీయాల్సిందిపోయి ఆవు కథ చెబుతున్నారు. 
► రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముడిపడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వ రంగంలోనే లాభాల బాటలో నడిపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోక్‌సభ, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోరాటం చేశారు. ఇప్పటికీ గట్టిగా నిలబడ్డారు. ఇవేవీ పట్టని పవన్‌ కల్యాణ్‌.. తన బాస్‌ చంద్రబాబు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. 

మీ బాస్‌ అధికారంలో లేడనే ఏడుపు
► రాజకీయాల్లోనే వారసత్వానికి వ్యతిరేకమా? సినిమాల్లో కూడా వారసత్వానికి వ్యతిరేకమా? పవన్‌ చెప్పాలి. సినిమాల్లో ఈ స్థాయికి పవన్‌ కల్యాణ్‌ ఎలా ఎదిగారో కూడా చెప్పాలి. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినప్పుడు పాచిపోయిన లడ్డూ ఇచ్చారంటూ ప్రధాని నరేంద్రమోదీని తిట్టావు. ఇప్పుడు ప్రశంసిస్తున్నావు. ఇంతలోనే ఏ రసాయనిక మార్పు జరిగిందో చెప్పాలి.
►  గిఫ్ట్‌గా దక్కిన రెండెకరాల భూమి కోసమే ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరావా? ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యే సీట్లు.. 22 లోక్‌సభ స్థానాలను గెలిపించుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రశ్నించే అర్హత రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌ కల్యాణ్‌కు ఎలా ఉంటుంది? సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉన్నాడనే ఆక్రోశం.. బాస్‌ చంద్రబాబు అధికారంలో లేడనే బాధతో పవన్‌ కల్యాణ్‌ ఏడుస్తున్నారు.
►  కొందరే కోట్లు కాజేసేందుకు కాకుండా అందరూ బాగా బతికే సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలం. నిర్మాతల కోరిక మేరకు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని తెస్తున్నాం. నిజాయితీ ఉంటే.. సినిమాకు రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటున్నావ్‌? ఎంత రెమ్యునరేషన్‌కు ట్యాక్స్‌ కడుతున్నావో చెప్పాలి.
► ఏడాదిలో ఖాళీగా ఉండే నాలుగు రోజులు బాస్‌ చంద్రబాబు చెప్పినట్లు రాజకీయాలు చేసే పవన్‌ కల్యాణ్‌ వంటి వారిని ప్రజలెవ్వరూ విశ్వసించకూడదు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top