దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ పాలన వైపు చూస్తోంది

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

అన్నా..జగనన్నా అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం

అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండుకళ్లుగా పాలన సాగుతోంది

ఎన్నికల మేనిఫెస్టో అర్థాలనే మార్చేసిన పాలన ఇది

ప్రతిపక్షాలకు ప్రజలు లేకుండా చేసిన పాలన ఇది

ఓటు వేయని వారిని కూడా సీఎం వైయస్‌ జగన్‌ తనవైపు నడిపించుకున్నారు

టీడీపీ అంపశయ్యపైకి వెళ్లింది

కరోనాపై కలిసికట్టుగా యుద్ధం చేద్దాం

 తాడేపల్లి:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన దేశానికే ఆదర్శంగా మారిందని, అందరూ ఆయన వైపే చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. అన్నా జగనన్న అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనమన్నారు. మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీల్లో రెండేళ్లకే 95 శాతం అమలు చేసి ప్రజల హృదయాల్లో సీఎం వైయస్‌ జగన్‌ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రెండేళ్లలో ప్రతిపక్షం కనిపించకుండా పోయిందని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి రెండేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ప్రజలంతా వైయస్‌ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారని, కోవిడ్‌ కరాళా  నృత్యం చేస్తున్న తరుణంలో ఇది సంబరాలకు, ఆడంబరాలకు సమయం కాదని, అందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాల్సిన సమయమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

జగనన్న పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులను చూశాం. ప్రజల నుంచి డైరెక్ట్‌గా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు చాలా అరుదు. ఆ ముఖ్యమంత్రికే ఓటు వేస్తున్నామని ప్రజలు చెప్పి మరీ ఓట్లు వేసి గెలిపించింది చాలా తక్కువ. వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, వారి తరువాత నేరుగా ప్రజల నుంచి అధికారం పొందిన వ్యక్తి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. అన్నా..జగనన్న అన్న మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం. 

దేశంలో, ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని తపన పడిన నాయకుడు వైయస్‌ జగన్‌. అందరూ కూడా వైయస్‌ జగన్‌ వైపే చూస్తున్నారు. ప్రజల్లో వైయస్‌ జగన్‌ చెరగని ముద్ర వేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ అందిస్తూ అవినీతి లేని పాలన సాగిస్తున్నారు. 

దేశంలో మరి కొందరూ కూడా ఏపీ వైపు చూస్తున్నారు.  నాయకుడు అంటే ఇలా ఉండకూడదని చంద్రబాబు వైపు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. ఓట్లు వేయని వారికి కూడా వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఓటు వేయని వారిని కూడా తన వైపు నడిపించుకున్న నాయకుడు వైయస్‌ జగన్‌. 

రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలహీనమయ్యాయి. ప్రతిపక్ష నాయకులు బయటకు రావడం లేదు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక చూసినా ఎగిరింది ఒకే ఒక జెండా..ప్రతిపక్షాలు బలహీనపడ్డాయి. చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ కేవలం 23 సీట్లతో అంపశయ్యపైకి చేరింది. తరువాత ఎన్నికల్లో అంతకంటే ఘోర పరాజయం మూటకట్టుకున్నారు. రెండేళ్లలో చంద్రబాబు బూడిద మిగిలింది. ఇప్పుడు జూమ్‌ మిగిలింది.

చంద్రబాబుది ముగిసిన చరిత్ర..చంద్రబాబు సినిమా అయిపోయింది. ప్రజలకు ఇది అర్థమైంది. టీడీపీ నాయకులు కూడా చాలా చక్కగా అర్థమైంది. రెండేళ్ల పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. 2019 వరకు ఉన్న రాజకీయ వ్యవస్థలు మార్చేశారు. ఎన్నికల మేనిఫెస్టో అర్థాన్నే మార్చేశారు. గతంలో మేనిఫెస్టోలు కనిపించకుండా వెబ్‌సైట్‌ నుంచి తొలగించారు. కానీ వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంధంగా భావించి అన్ని హామీలు అమలు చేసి నిరూపించారు. 

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌తో అతలాకుతలం అయ్యింది. అయినా ఏపీలో సమర్థవంతమైన నాయకత్వం..ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు 95 శాతం అమలు చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌. 129 వాగ్ధానాలు ఇస్తే..వాటిలో 107 వాగ్ధానాలు అమలు చేశారు. 8 వాగ్ధానాలు మాత్రమే మిగిలిపోయాయి. వాటిని ఈ మూడేళ్లలో అమలు చేస్తారు. ఇంతచక్కటి పాలన, చిత్తశుద్ధితో పాలిస్తున్న ప్రభుత్వం వైయస్‌ జగన్‌ సర్కార్‌ మాత్రమే.

అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది. అద్భుతమైన పాలన అందించిన ప్రభుత్వం మాది. మేం పండుగలు చేసుకోవాలి. కానీ అర్భాటాలకు ఇది సమయం కాదు. దేశం మొత్తం కరోనా కరాళానృత్యం చేస్తోంది. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లి కనిపించని శత్రువు కరోనాపై యుద్ధం చేయాలి. అద్భుతమైన పాలనకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. లక్షా 20 వేల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా అందించారు. 

ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేస్తున్నామో సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేసి మరీ పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం జూమ్‌లో ప్రభుత్వంపై బురద జల్లుతూ..వైయస్‌ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు జూమ్‌ మీటింగ్‌లతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
 

Back to Top