చంద్రబాబు అవకాశవాది

17 కేసుల్లో చంద్రబాబు ముద్దాయి

ప్రజా సమస్యలపై చంద్రబాబు అవగాహన లేదు

కేసీఆర్‌ కేసు పెడితే పారిపోయి ఆంధ్రాకు వచ్చారు

వైయస్‌ఆర్‌సీపీ చీరాల అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌

 

ప్రకాశం: చంద్రబాబుపై 17 కేసులు ఉన్నాయని చీరాల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ అన్నారు.ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ముద్దాయి అని,  నాపై ఉన్న కేసులు ప్రజా ఉద్యమంలో జరిగిన కేసులని తెలిపారు. చంద్రబాబులా దోచుకున్న కేసులు కాదన్నారు. చంద్రబాబు పిరికివాడు,అవకాశవాది అని ధ్వజమెత్తారు.  కేసీఆర్‌ కేసు పెడితే చంద్రబాబు పారిపోయి ఆంధ్రాకు వచ్చారన్నారు.నేను ఇక్కడే ఉండి ప్రజల కోసం పోరాడతున్ననన్నారు.చీరాలకు ఎయిర్‌పోర్ట్‌ తెస్తానని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్‌గా అభివర్ణించారు. ప్రజలకు ఏం అవసరమో చంద్రబాబుకు అవగాహన లేదన్నారు. చీరాలకు అతి తక్కువగా చంద్రబాబు నిధులు ఇచ్చారు.ప్రజలకు పన్నులు కట్టి మేం అభివృద్ధి చేసుకున్నాం తప్ప చీరాలకు చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 

   
Back to Top