రాజధానిపై ప్రేమ ఉంటే ఇక్కడెందుకు పోటీ చేయలేదు పవనూ?

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
 

గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌కు నిజంగా రాజధానిపై ప్రేమ ఉంటే ఇక్కడ ఎందుకు పోటీ చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలదీశారు. కనీసం వారి పార్టీ అభ్యర్థినైనా ఎందుకు పోటీకి పెట్టలేదని ప్రశ్నించారు. లెప్ట్‌ పార్టీ అభ్యర్థి తరఫున ఎందుకు ప్రచారం చేయలేదన్నారు. లోకేష్‌ గెలుపునకు తెర వెనుక పవన్‌ ప్రయత్నాలు ప్రజలకు తెలుసు అన్నారు.ఇవాళ రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తే జనం నమ్మరని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ రాజధాని పర్యటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్కే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్యాకేజీ అందినప్పుడు ఒకలా..అందినప్పుడు మరోలా మాట్లాడటం పవన్‌కు అలవాటు అయ్యిందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను పవన్‌ బయటపెట్టాలని,అక్రమాలు జరుగుతున్నాయని అప్పట్లో బేతపూడిలో పవన్‌ ప్రకటించారని గుర్తు చేశారు.భూసేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పవన్‌ ప్రకటించారని తెలిపారు. ఆ తరువాత నాలుగు సార్లు భూసేకరణ జరిపితే పవన్‌ ఏమయ్యారని ప్రశ్నించారు. 
 

Back to Top