మంగళగిరిలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన

టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది.

చంద్రబాబు అక్రమమార్గంలో గెలవాలని చూస్తున్నారు.

లోకేష్‌ ఓడిపోతాడనే ఎమ్మెలీ పదవికి రాజీనామా చేయించలేదు.

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి

విజయవాడ: మంగళగిరిలో అధికార టీడీపీ పార్టీ యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ మంగళగిరి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేవంలో ఆయన మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ కోడ్‌ ఉల్లంఘిస్తోందని,  కోడ్‌ అమలులో ఉన్నప్పటికి కూడా  పోలీస్‌ వ్యవస్థ, ఇతర వ్యవస్థలను మేనేజ్‌ చేసి అప్రజస్వామికంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని, కొంతమంది సర్వే చేసున్న యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించామన్నారు. 

కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. సుమారు 200 నుంచి 300 వరుకు యువకులను నియమించుని  ప్రతి బూత్‌లోకి వెళ్ళి ఏపార్టీకి ఓటు వేస్తారు,ఆధారాలు,బ్యాంక్‌ ఖాతాల  వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాగానే సర్వేలు చేయడం నేరమని  తెలిసి కూడా కోడ్‌  ఉల్లంఘన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోనేలా చేయాలన్నారు.  ఓటమి భయంతో చంద్రబాబు అడ్డగోలు సర్వేల ద్వారా  ఓటర్‌కు ఐదు వేల రూపాయలు ఆన్‌లైన్‌ ద్వారా టాన్స్‌ఫర్‌  చేస్తున్నారని ఆగ్రహం వ్యకత చేశారు. ఆ  స్లిప్పులతో సహా డౌన్‌లోడ్‌ చేసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామన్నారు. సెల్‌ఫోన్లును విపరీతంగా పంచుతున్నారన్నారు. కొత్త టూ వీలర్స్‌ను వార్డు స్థాయి నాయకులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. తండ్రి,కొడుకులూ ఇద్దరు మంగళగిరికి ఏంచేశారో  చెప్పాలన్నారు.

ధర్మానికి,అధర్మానికి నేడు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.పేదవాడికి ముద్ద అన్నం పెట్టాలని మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా అనుకుంటాడు.కాని ముద్ద అన్నం పెట్టాలనే ఇంకిత జ్ఞానం  చంద్రబాబు,లోకేష్‌లకు లేదన్నారు. మంగళగిరిలో  పేద రైతుల దగ్గర నోటి ముద్దను లాక్కొవడానికి మంగళగిరిలో పోటి చేస్తున్నారన్నారు. ఐదు సంవత్సరాల కాలంలో  ఏ ఒక్క అభివృద్ధి చేయలేదన్నారు. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే చంద్రబాబే పోటి చేయాలన్నారు. ఆర్కే చేతిలో లోకేష్‌ ఓడిపోతాడు.ఇక్కడ రైతులు,పేదవారిని ఇబ్బందులు పెట్టాను.మా అబ్బాయి లోకేష్‌ ఓడిపోతే శాశ్వతంగా తన నుంచి బాధలు తొలగిపోతాయని  చంద్రబాబు లోకేష్‌ను పోటికి పెట్టాడన్నారు. యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని, ఎన్నికల అధికారులు, ఎన్నికల సంఘం సక్రమంగా విధులు నిర్వహించాలని కోరారు. ధర్మాని కాపాడేవిధంగా న్యాయంగా ఎన్నికలు జరిగాలన్నారు. పోలీసులు ఒకే సామాజిక వర్గానికే తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.

మంగళగిరిలో చంద్రబాబు సామాజిక వర్గం ఓట్లు 10వేల  చేర్పించారన్నారు. మంగళగిరిలో ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా చేశారన్నారు.సదావర్తి భూములను కబ్జా కాకుండా న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నానన్నారు.అప్రజాస్వామికంగా గెలవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తుందన్నారు.చంద్రబాబు వ్యవహారాన్ని పవన్‌ కల్యాణ్‌ గమనించాలన్నారు.ల్యాండ్‌ ఆక్విజేషన్‌ చేస్తే నిరాహార దీక్ష చేస్తానని పవన్‌ అన్నారు.ఇప్పటికే మూడు ల్యాండ్‌ ఆక్విజేషన్‌ జీవోలు విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌ ఎందుకు  ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు.మంగళగిరిలో పవన్‌కల్యాణ్‌ పోటిచేస్తారని అనుకున్నానన్నారు. మంగళగిరిలో లోకేష్‌ ఓడిస్తారని చంద్రబాబుకు తెలుసునని,అందుకే లోకేష్‌ ఎమ్మెల్సీ పదవికి రాజీమానా చేయించలేదన్నారు.సోమిరెడ్డి,రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారని లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయలేదో అందరికి తెలుసునన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top