వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు. వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలోకి చేరుతున్నట్లు పార్టీలోకి చేరినవారు తెలిపారు. ప్రకాశం జిల్లా పామూరులో కనిగిరి వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ బు్రరా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో బోయ,మదురాజ్ కులాలకు చెందిన 350 కుటుంబాలు టీడీపీ నుంచి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్యాద్రి చౌదరి,అబ్దుల్ గఫార్,హుస్సేన్‌రెడ్డి,చాంద్‌బాషా, గురవయ్య పార్టీలోకి చేరారు. నెల్లూరు జిల్లా వింజమూరులో వైయస్‌ఆర్‌సీపీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 200 మంది టీడీపీ కార్యకర్తలు చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. తిరుపతిలో వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ దొడ్డా రెడ్డి శంకర్ రెడ్డి, మార్కెట్ యూనియన్ ప్రెసిడెంట్ గురువారెడ్డి,కురబా సంఘం రాష్ట్ర వైయస్ ప్రెసిడెంట్ రెడ్డి కుమార్ గౌడ,పారిశ్రామిక వేత్త మోహన్‌రావు, ఎస్‌జి రంగా పాలక మండలి సభ్యుడు మురళీనాథ్ రెడ్డి పార్టీలోకి చేరారు. అనంతపురం జిల్లా మదిగుబ్బ మండలం కొడవండపల్లి,పెద్ద చిగుళ్లరేవు,నాగారెడ్డి పల్లిలో147 టీడీపీ కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.