అమరావతి: తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో కూడిన వైయస్ఆర్‌సీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా శాసనమండలిలో విప్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మండిపడ్డారు.మాజీ ఐఏఎస్ అధికారి ముసుగులో అపర మేధావి అయిన రమేష్ కుమార్ సిటిజన్ ఫర్ డెమక్రసీ పేరుతో సంస్ధ పెట్టి కార్యదర్సిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా,రాజ్యంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్ అధికారి,మాజి ఎన్నికల కమీషనర్ ముసుగులో టిడిపి కార్యకర్తలా పనిచేయడం కాదు. కావాలంటే ముసుగు తీసి టిడిపి కండువా కప్పుకుని పనిచేయి. దమ్ము,ధైర్యం ఉంటే చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై మాట్లాడు. ఎన్నికల కమీషనర్ గా పనిచేసినప్పుడు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డావో ప్రజలందరికి తెలుసు. టిడిపికి ఎలా అనుకూలంగా పనిచేశావో గుర్తుతెచ్చుకో.ఇకనైనా దొంగవేషాలు మానుకోవాలని సూచించారు. హైద్రాబాద్ లో చంద్రబాబు ఓటర్ల నమోదుకు సంబందించి చేస్తున్న అక్రమాల గురించి ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పేరిట సంస్ధను పెట్టి గతంలో పనిచేసినప్పుడు దుగ్గిరాలలో ధర్నా చేశారు.దుగ్గిరాలలో ఓట్లు తొలగిస్తున్నారు. ఈ ప్రాంతంలో లేని వారి ఓట్లను blo లు విచారించి తీసివేస్తే అదేదో అపరాధం చేసినట్లు ఆందోళన చేస్తే దానికి పచ్చమీడియా భారీఎత్తున ప్రచారం చేసింది.అప్పుడు అలా చేసిన నిమ్మగడ్డ ఇప్పుడు టిడిపి చేస్తున్న అక్రమాలపై ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు.వాలంటీర్లను ఓటర్ల జాబితా కు సంబంధించి వినియోగించకపోయినా కూడా వాలంటీర్లను వాడుతున్నారని సుప్రీంకోర్టులో కేసు వేసి దుర్మార్గానికి ఒడిగట్టారని అన్నారు.నిమ్మగడ్డ లాంటి వ్యక్తుల ఆటలు ఎల్లకాలం కొనసాగవని అన్నారు. వైయస్ఆర్‌సీపీ గాని, మా అధ్యక్షులు వైయస్ జగన్ గారు గాని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలనే ధ్యేయంతో ఉన్నామని అన్నారు.ఆ ఓటు కూడా ఓటరు ఎక్కడైతే స్దిర నివాసం ఉంటారో అక్కడే ఉండాలనేది పదే పదే కోరుతున్నామని తెలియచేశారు.ఎన్నికల కమీషన్ కు కూడా మూడుసార్లు మా పార్టీ విధానం ఇది అని చెప్పామని అన్నారు.తెలుగుదేశంకు సంబంధించి చంద్రబాబు ఏపిలోనే కాదు భారతదేశంలో వ్యవస్దలను మేనేజ్ చేయడంలో సిధ్దహస్తుడని అన్నారు.గతంలో చాలాసార్లు చంద్రబాబు గురించి విన్నామని అన్నారు.ఏపిలో నాలుగునెలల్లో ఎన్నికలు జరగబోతుంటే పక్కనున్న తెలంగాణాలో ఎన్నికలు అయిపోయాక తెలుగుదేశం పార్టీ పేరుతో బ్యానర్లు కట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసి అక్కడ ఉన్న ఓట్లను ఇక్కడ చేర్చే కార్యక్రమం చేపట్టడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఫారం 6 అనేది నూతనంగా ఓటర్లుగా నమోదు చేయడానికి ఉపయోగించేదన్నారు.ఓటర్లు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వచ్చినట్లయితే ఫారం 8 ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలి.కాని ఫారం 6 ఉపయోగించి 30 సంవత్సరాల పైబడిన ఓటర్లను టిడిపి నమోదు చేయిస్తోందని అన్నారు. నిజంగా ధైర్యం ఉంటే ఫారం 8 వాడాలన్నారు.ఇదంతా ఓ పధకం ప్రకారం చేస్తోందని అన్నారు.ఇందుకు ఆధారాలను అందచేశామని వివరించారు. రాష్ర్ట మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని అన్నారు. హైదరాబాద్ లో ఓటు వేసిన వారు ఏపీ లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.హైదరాబాద్ లో ప్రగతి నగర్ లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీలో ఓటర్లకు సంబంధించి న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక డ్రైవ్ ద్వారా చేస్తున్నారని తెలియచేశారు.ఇందుకోసం టిడిపి అదినేత చంద్రబాబు ఆదేశాలమేరకు హైదరాబాద్ ప్రగతి నగర్ లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వివరించారు.పచ్చిఅవకాశవాది అయిన చంద్రబాబు దుర్బుధ్దితో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు నపుంసకుల్లా మాట్లాడుతున్నారు.తెలంగాణ లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా ఎన్నికల కమీషన్ కలెక్టర్ల కు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని కోరారు. శాసనసభ్యుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో లేని వారిని తీసుకువచ్చి ఇక్కడ ఓటర్లుగా చేర్పించే విధంగా టిడిపి చేస్తోందని ఇది నిబంధనలకు విరుద్దమని తెలియచేశారు. కుట్రపూరితంగా టిడిపి ఇలా చేస్తోందని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేయడం రాజ్యాంగ విరుధ్దం అన్నారు. దీనిని ఎన్నికల కమీషన్ అడ్డుకోవాలని కోరారు.అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. ఈ రోజు దేవినేని ఉమ, మరికొందరు కలిసి అసందర్భంగా వైయస్సార్ సిపిపై విమర్శలు చేస్తున్నారన్నారు. సజ్జలరామకృష్ణారెడ్డి గారిపై,ధనుంజయరెడ్డిగారిపై విమర్శలు చేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే తగిన బుధ్ది చెబుతామని హెచ్చరించారు.