రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంద‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

నంద్యాల జిల్లా: రాయలసీమ ప్రాంతానికి కీలకంగా భావిస్తున్న పోతిరెడ్డిపాడు వద్ద నిలిచిపోయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు సంద‌ర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పథకం పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతానికి సాగునీటి అవసరాలు తీర్చడంలో ఈ ఎత్తిపోతల పథకం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పథకం పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.

Back to Top