చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలి

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు

గుంటూరు, ప‌ల్నాడు జిల్లాలకు సంబంధించిన `బాబు షూరిటీ - మోసం గ్యారంటీ`  కార్యక్రమంపై పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం

గుంటూరు: చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ‌ తాడేపల్లిలోని శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్‌లో గుంటూరు - పల్నాడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన "బాబు షూరిటీ - మోసం గ్యారంటీ" అనే కార్యక్రమంలో భాగంగా పార్టీ నేత‌ల‌కు వైవీ సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ స‌మావేశంలో గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులు , పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ అంబటి రాంబాబు, విజయవాడ పార్లమెంట్ పరిశీలకులు మొడిగుల వెంకట గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ దొంతి వేమా రెడ్డి , మాచర్ల ఇంచార్జ్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, గురిజాల ఇంచార్జ్ కాసు మహేష్, గౌతమ్ రెడ్డి , తాడికొండ ఇంచార్జ్ బాల వజ్రబాబు, తెనాలి ఇంచార్జ్ శివకుమార్, వినుకొండ ఇంచార్జ్ బ్రహ్మనాయుడు , న‌రసరావుపేట ఇంచార్జ్ గోపిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ  జెండా మోసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన బాధ్యత వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలపై ఉందన్నారు. పెన్షన్లు పెంచామని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. దీనిపై ప్రజలే సమాధానం చెబుతారు అని కామెంట్స్‌ చేశారు.  ఇంకా ఏమ‌న్నారంటే..`వైయ‌స్‌ జగన్‌ చేసింది సుపరిపాలనో.. చంద్రబాబు చేసేది సుపరిపాలనా అనేది ప్రజలకు తెలియజేయాలి. కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా జగన్ చేసింది సుపరిపాలన. పెన్షన్లు పెంచామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడు. ఎంతమంది పెన్షన్లు అందక ఇబ్బంది పడుతున్నారో మారుమూల గ్రామాలకు వెళితే తెలుస్తుంది. అదే వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉండి ఉంటే ఈ ఏడాది కాలంలో ఏం చేయగలిగేవారో ప్రజలకు మనం తెలియజేయాలి. వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు మన కార్యకర్తలకు సెల్ ఫోనే ఆయుధం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం. జెండా మోసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది` అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ నేతలు ఇంటింటికీ తిరిగారు. బాండ్లు చూపించి మరీ ఎంతెంత వస్తాయో చెప్పారు. చంద్రబాబు రీకాల్ కార్యక్రమంలో బాబు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించడం మన బాధ్యత. నియోజకవర్గం, మండల స్థాయిలో చంద్రబాబు రీకాల్ కార్యక్రమాన్ని వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలంతా విజయవంతం చేయాలి. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజలు ఈ ప్రభుత్వంపై సంతృప్తిగా లేరు. ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ..‘పోరాటాలు మనకు, మన పార్టీకి కొత్త కాదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పోరాటం చేసిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ . వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో మరోసారి మనం పోరాటాలకు సిద్ధమవ్వాలి. ఆచరణ కాని అబద్ధాల్లో చంద్రబాబు ఆరితేరిన వ్యక్తి.  వైఎస్‌ జగన్‌ను చూసి చంద్రబాబు మారాడని ప్రజలు భ్రమపడి ఓటేశారు. వైయ‌స్ఆర్‌సీపీ  పోరాటం వల్లే ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి కార్యక్రమానికి ఎవరూ కార్లు పెట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ, వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా వైఎస్‌ జగన్‌ వెంట తరలివచ్చారు. చంద్రబాబు అనుకూల మీడియానే వైఎస్‌ జగన్‌ బలం గురించి నిజం ఒప్పుకుంటోంది. వైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలంతా సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించాలి.

మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌కు, వైయ‌స్ఆర్‌సీపీ కి అనుసంధానం కార్యకర్తలే. సచివాలయాలను నమ్ముకుని మనం మునిగిపోయాం. రెండు అబద్ధాలు చెప్పి అయినా సరే మనం అధికారంలోకి వద్దామని వైఎస్‌ జగన్‌ను కోరాం. కానీ, అబద్ధాలు వద్దని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేని వ్యక్తి చంద్రబాబు. ఈ ఐదేళ్లూ పనిచేసిన మన కార్యకర్తలను మర్చిపోకుండా పేర్లు రాసుకుందాం. మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తాం. చంద్రబాబు ష్యూరిటీ మోసం గ్యారంటీని మనం జనంలోకి తీసుకెళ్లాలి. జంప్ జిలానీలంతా టీడీపీలోకి పోయారు. మన దగ్గర దమ్ బిర్యానీ వంటి నాయకులు, కార్యకర్తలు మిగిలారు’ అని చెప్పారు.  

Back to Top