విశాఖ కలెక్టర్‌ను కలిసిన వైయస్‌ఆర్‌సీపీ నేతలు

విశాఖపట్నం : ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.సోమవారం విశాఖ కలెక్టర్‌ను వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు.అరకు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెట్టి ఫాల్గుణ ఎన్నికల కమిషనర్‌ను కలిశారు. పోలింగ్‌ కేంద్రాల మార్పు సమాచారం  తెలియక గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, అరకు నియోజకవర్గం బంగాపుట్‌ పంచాయతీలోని 2  పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.
 

Back to Top