ముద్రగడ పద్మనాభం మృతిపై వైయస్సార్‌సీపీ నేతల ప్రగాఢ సంతాపం 

తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి  ముద్రగడ పద్మనాభం మృతిపట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ పద్మనాభాన్ని కొనియాడుతూ, ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు.

 భూమన కరుణాకర్ రెడ్డి

వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి  భూమన కరుణాకర్ రెడ్డి  ముద్రగడ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తిగా ఆయన చిరస్మరణీయులని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  వైవీ సుబ్బారెడ్డి

వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు  వైవీ సుబ్బారెడ్డి ముద్రగడ ప్రజా జీవితంలో ప్రదర్శించిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

  జూపూడి ప్రభాకరరావు

దళిత ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి  జూపూడి ప్రభాకరరావు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి నాయకుడిగా, కాపు సమాజ ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

 వెలంపల్లి శ్రీనివాసరావు

మాజీ మంత్రి **వెలంపల్లి శ్రీనివాసరావు** ముద్రగడ పద్మనాభం హఠాన్మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల కోసం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం ఆయన జీవితాంతం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. ఆయన నిబద్ధత, నిష్కల్మషమైన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

 మల్లాది విష్ణు

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముద్రగడ మరణం ప్రజా ఉద్యమాలకు, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. విజయవాడతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఏడు సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి, చివరి శ్వాస వరకు రాజీలేని పోరాటం చేశారని కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయానికి ఆయన ప్రతీకగా నిలిచారని అన్నారు.

- మాజీ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్
మాజీ మంత్రి **డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్** ఒక గొప్ప ఉద్యమ నాయకుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. ముద్రగడ మరణం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ  డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ముద్రగడ పద్మనాభం ప్రజా ఉద్యమాలతో పాటు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం ఏడు సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధతతో రాజకీయాలు చేశారని కొనియాడారు. ఆయన మరణం కుటుంబానికే కాకుండా పార్టీకి కూడా తీరని లోటని అన్నారు.

  సాకే శైలజానాథ్

మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ముద్రగడ పద్మనాభం హఠాన్మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఆయన కాపు సామాజిక వర్గంతో పాటు బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

Back to Top