వంశీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

కృష్ణా జిల్లా:  మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  విజయవాడ జైలు నుంచి విడుదల కావ‌డంతో  గురువారం వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప‌లువురు ఆయ‌న ఇంటికి వెళ్లి ప‌రామ‌ర్శించారు.  కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీపై 11  అక్రమ కేసులు నమోదు చేసింది. ఫిభ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. నాటి నుంచి 140 రోజుల పాటు జైలులో ఉన్న వల్లభనేని అక్రమ అరెస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నూజివీడు కోర్టు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది. దీంతో ఈ నెల 2వ తేదీ విజయవాడ సబ్‌ జైల్‌ నుంచి విడుదలయ్యారు. ఆయ‌న‌కు నిన్న పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇవాళ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌, త‌దిత‌రులు ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పారు. 

Back to Top