మతి భ్రమించి మాట్లాడుతున్న బుచ్చ‌య్య చౌద‌రి

ప్రాణభయం ఉన్నది ఏబీఎన్ రాధాకృష్ణకు కాదు

ఆయన వల్ల మన రాష్ట్రానికి ప్ర‌మాదం

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మండిపాటు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో మాజీ ఎమ్మెల్యే జ‌క్కంపూడి రాజాతో క‌లిసి మీడియాతో 
మాట్లాడిన చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, టీడీపీ సీనియ‌ర్ నేత బుచ్చ‌య్య చౌద‌రి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు

బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

చంద్రబాబు మెప్పు కోసం అసత్య ఆరోపణ‌లు

ఏబీఎన్ రాధాకృష్ణ వల్లే రాష్ట్రానికి హాని 

మీడియాను మాఫియాగా మార్చి జగన్‌పై విషప్రచారం చేస్తున్నారు

అసత్య కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ధ్వ‌జం

నిరసనలను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం

టీడీపీ గుండాలు సాక్షి కార్యాలయాలపై దాడులు మరిచిపోయారా? 

సూటిగా ప్ర‌శ్నించిన చెల్లుబోయిన 

రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల నియంత్రణలో ప్రభుత్వం విఫలం

క్యాబినెట్ ఆశలతో బుచ్చయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు

టీడీపీదే హత్యా రాజకీయాల చరిత్ర 

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి వేణుగోపాల‌కృష్ణ   

జగన్‌పై దుష్ప్రచారం కొనసాగితే సహించేది లేద‌ని  జ‌క్కంపూడి రాజా వార్నింగ్‌

రాజమహేంద్రవరం:  టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలపై వైయ‌స్ఆర్‌సీపీ తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వయసు మీదపడడంతో ఆయనకు మతి భ్రమించినట్టుగా కనిపిస్తోందని, అందుకే బాధ్యతారాహిత్యంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  కనీస విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ఆయన స్థాయికి తగదని పేర్కొన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణకు ప్రాణభయం ఉందని బుచ్చ‌య్య చౌద‌రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు.  వాస్తవానికి రాధాకృష్ణ వల్లే రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని, మీడియాను మాఫియ‌గా మార్చుకొని ప్రజలను తప్పుదోవ పట్టించడం, చంద్ర‌బాబును జాకీలు పెట్టి లేప‌డం, నిత్యం వైయ‌స్ జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నార‌ని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని పార్టీ జిల్లా కార్యాల‌యంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ మండిప‌డ్డారు. రాజకీయ విమర్శలు హద్దుల్లో ఉండాలని, వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు.
ప్రెస్‌మీట్‌లో చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ ఏమ‌న్నారంటే..

చంద్ర‌బాబు మెప్పు కోస‌మే బుచ్చ‌య్య అస‌త్య ఆరోప‌ణ‌లు
టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవి. ప్రజలను తప్పుదోవ పట్టించడ‌మే లక్ష్యంగా ,  చంద్రబాబు వద్ద మెప్పు పొందడానికే బుచ్చయ్యచౌదరి అసత్య ఆరోపణలు చేస్తున్నారు.  ఏబీఎన్ రాధాకృష్ణ వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందున ఆయనపై దాడులు జరిగే అవకాశముందని బుచ్చయ్యచౌదరి చెప్పడం విచిత్రం. వాస్తవానికి రాధాకృష్ణ వల్లే రాష్ట్రానికి హాని జరుగుతోంది.  మీడియాను మాఫియాగా మార్చి చంద్రబాబును జాకీల‌తో లేపుతూ..నిత్యం జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు. అసత్య కథనాలు ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఆర్థిక ప్రయోజనాల కోసం మీడియాను వాడుకోవడమే చంద్ర‌బాబు నైజం.   

 రాధాకృష్ణ వల్ల సమాజానికి హాని 
బుచ్చయ్య చౌదరి గారు, మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా? ఒకవేళ రాధాకృష్ణ నిజంగా ప్రజా సమస్యలు వెలికి తీస్తుంటే, ఆయనకు ప్రాణహాని ఉండొచ్చు. అది కూడా మీ పార్టీ నాయకుడి వల్ల, సీఎం చంద్రబాబు వల్లే. ఎందుకంటే ఆయన పత్రికల్లో ఎక్కడా నెగటివ్ వార్తలు ఒప్పుకోరు. తానేం చేసినా సమర్థిస్తూ రాయాలని కోరుకుంటారు. నిజాలను ఆయన ఎప్పుడూ సహించరు. అందుకే మళ్లీ చెబుతున్నాం… మీడియా మాఫియాలా మారిన రాధాకృష్ణ వల్ల సమాజానికి హాని జరుగుతోంది. అంతే కానీ ఏబీఎన్ రాధాకృష్ణ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు.  
 
క్యాబినెట్‌లో చోటు కోస‌మేనా?
క్యాబినెట్‌లో చోటు దక్కించుకోవాలనే ఆశతోనే బుచ్చయ్యచౌదరి నోటికి వ‌చ్చిన‌ట్లు ప్ర‌తిప‌క్షంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. రాధాకృష్ణను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాధాకృష్ణ ప్రాపకం కోసమా? లేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికా?  బుచ్చ‌య్య చౌద‌రి స‌మాధానం చెప్పాలి.

ఎవ‌రిది హ‌త్యా రాజ‌కీయ చ‌రిత్ర‌
రాజారెడ్డిది హత్యా రాజకీయ చరిత్ర కాదు.  మీ మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లు చేస్తూ రాష్ట్రంలో హ‌త్యా రాజకీయాలు… హింసా రాజకీయాల‌కు తెర లేపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. గుంటూరులో దాదాపు 7 గంటల పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై విడతల వారీగా టీడీపీ గుండాలు దాడి చేసి, ఆయన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. మరి ఎవరిది హత్యా రాజకీయం? ఎవరు గుండాగిరి చేస్తున్నారు? మళ్లీ నిస్సిగ్గుగా వివేకాగారి హత్య గురించి మాట్లాడుతున్నారు.  రాష్ట్రంలో హత్యా రాజకీయాల చరిత్ర టీడీపీదే. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా హ‌త్య ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌జ‌లు మ‌ర‌చిపోలేదు.  ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది ఇంకా గుర్తుంది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఈ రెండేళ్లలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులు పెరిగాయి. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి, అంబటి రాంబాబు ఇంటిపై గంటల తరబడి దాడి జరిగింది. ఇది హత్యా రాజకీయమా ?కాదా?. నిరసనలను దాడిగా చిత్రీకరించడం దుర్మార్గం.

అన్నీ నిరాధార ఆరోప‌ణ‌లే
వివేకా హత్య కేసులో జగన్‌ను ఇరికించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. కూట‌మి నేత‌లు ఆధారాలు లేకపోయినా నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయ ల‌బ్ధి పొందాలని చూస్తున్నారు. కోర్టులో ఉన్న విషయాలపై తామే తీర్పులు చెప్పడం తగదు.

జగన్‌పై దుష్ప్రచారం చేస్తే సహించబోము: జ‌క్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే
బుచ్చయ్యచౌదరి భాష రోజురోజుకు దిగజారుతోంది. వ‌యసు మీద‌ప‌డే కొద్ది ఆయ‌న దిగ‌జారి మాట్లాడుతున్నాడు.  వైసీపీ వెధ‌వ‌లు అంటున్నాడు. మేం వెధ‌వ‌న్న‌ర వెధ‌వ‌లు అన‌గ‌లం. కానీ మా నాయ‌కుడు మాకు విలువలు నేర్పారు. టీడీపీ హ‌త్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ రెండేళ్ల పాలనలో హత్యలు, అత్యాచారాలు పెరిగాయి, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై విప‌రీతంగా దాడులు జ‌రుగుతున్నాయి. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది, నిరుద్యోగ భృతి, ఫించన్లు, ఆడబిడ్డ నిధి వంటి అంశాల్లో ఎలాంటి పురోగతి లేదు.

రెండేళ్ల పాల‌న‌లో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక ప్ర‌తిప‌క్షంపై అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తూ ..వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డుతున్నారు. ఇక‌పై మా పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌పై దుష్ప్ర‌చారం చేస్తే స‌హించ‌బోం. అధికారం శాశ్వ‌తం అని విర్ర‌వీగుతున్నారేమో.. ప్రజలు మా వెంట ఉన్నారని మరవద్దు అని జ‌క్కంపూడి రాజా హెచ్చ‌రించారు.

Back to Top