అన్నార్తుల ఆకలి తీర్చడం తప్పా?

అది ఈశ్వర ఆరాధన కాదా?

బీజేపీ విమ‌ర్శ‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ధీటైన జ‌వాబు

హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయ్‌?

సూటిగా ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

బీజేపీ పూర్తిగా దిగజారి, వక్రీకరణ చేస్తోంది

ఆనాడు బాబు పాలనలో 40 గుడులు కూల్చారు

అప్పుడు మీరూ వారితో కలిసి అధికారంలో ఉన్నారు

ఆ పాపంలో మీకూ వాటా ఉంది

దాన్ని మర్చి ఇప్పుడు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు

బీజేపీకి గుర్తు చేసిన వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ నేతలు

మా సీఎంగారికి హిందుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది

ఆయన ఎక్కడా, ఎప్పుడూ ఎవరినీ అగౌరవపర్చలేదు

బీజేపీ విమర్శలను ముక్త కంఠంతో ఖండిస్తున్నాం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నేతల స్పష్టీకరణ

తాడేప‌ల్లి: అన్నార్తుల ఆకలి తీర్చడం తప్పా?..అది ఈశ్వర ఆరాధన కాదా? అని  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ప్ర‌శ్నించారు.  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ చేసిన ట్వీట్‌పై బీజేపీ  విమర్శలకు వైయ‌స్ఆర్‌సీపీ నేతల ధీటైన జవాబు ఇచ్చారు. బీజేపీ అర్ధంలేని విమర్శలు, ఆరోపణలు చేస్తుంద‌ని మండిప‌డ్డారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరెవరు, ఏమన్నారంటే..:

మేము ఎందుకు క్షమాపణ చెప్పాలి?:  బొత్స సత్యనారాయణ. విద్యా శాఖ మంత్రి:
– బీజేపీ పూర్తిగా దిగజారిపోయి వక్రీకరణ చేస్తోంది. నిన్న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా, అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వర ఆరాధన అని చెబుతూ.. మా పార్టీ అఫీషియల్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ శివయ్య చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పాం. మరి అందులో హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయో అర్ధం కావడం లేదు. ఆ ట్వీట్‌లో పరమ శివుడ్ని కించ పర్చినట్లు ఎక్కడ ఉందో చెప్పండి?
నిన్న బీజేపీ వాళ్లు శివాలయాలకు వెళ్లడం మర్చిపోయినట్లు ఉన్నారు. అందుకే ఈరోజు ‘కోవెలకు వెళ్దాం’ అంటూ ధర్నాలు చేపట్టారు. బీజేపీ ఏ విధంగా దిగజారిపోతుందో, వక్రీకరిస్తుందో దీన్ని బట్టి అర్ధం అవుతోంది. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం సరికాదని బీజేపీ పెద్దలను కోరుతున్నాను. మా సీఎంగారికి, మాకు భగవంతుడి పట్ల, హిందుత్వం పట్ల పూర్తి విశ్వాసం ఉంది. మీలా దొంగ తత్వాలు, డబుల్‌ గేమ్‌లు, మీరే కోవెలలు కూల్చి, మళీ మీరే ఆందోళన చేయడం వంటివి మాకు చేతకావు. ఈరోజు ఎల్లో మీడియాలో వచ్చిన వార్త, బీజేపీ విమర్శలను ఏకకంఠంతో ఖండిస్తున్నాం. మేమసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలి? అసలు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో చెప్పండి. అప్పుడు మాట్లాడదాం.

వారికి ప్రతిదీ రాజకీయమే:  కొట్టు సత్యనారాయణ. డిప్యూటీ సీఎం (దేవాదాయ శాఖ):
– మహాశివరాత్రి పర్వదినాన మా సీఎం వైయస్‌ జగన్‌ కారికేచర్‌తో ఉన్న ట్వీట్‌లో వివాదాస్పదమైంది ఏదీ లేదు. ఒక చిన్న పిల్లవాడికి పాలు పట్టడం నేరమా? దాన్ని బీజేపీ విమర్శించడం దుర్మార్గం. బీజేపీకి రాజకీయం తప్ప హిందూమతం, హిందూధర్మాన్ని రక్షించే ఆలోచన ఏ కోశాన లేదు. అసలు హిందూత్వం గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న బీజేపీ నైజాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో 40 గుడులను కూల్చినప్పుడు, అప్పుడు వారితో కలిసి అధికారం పంచుకున్న బీజేపీ ఏం చేసింది?. హిందుత్వం బీజేపీ బ్రాండ్‌ కాదు. హిందూత్వాన్ని వాడుకుని రాజకీయం చేయడం బీజేపీకి తగదు. 

మత రాజకీయం చేస్తూ పెత్తందారీలా బీజేపీ:  కొడాలి వెంకటేశ్వరరావు (నాని). మాజీ మంత్రి:
– ఆకలిగా ఉన్న వారికి అన్నం పెడుతున్నారు మా సీఎంగారు. ఆయన ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలుస్తున్నారు. దాన్ని ఫోటో రూపంలో ఒక అభిమాని చిత్రించాడు. పెత్తందార్లైన బీజేపీ నాయకులు దాన్ని మత రాజకీయాలకు వాడుకోవడం అసలు మానవత్వమేనా?.

సీఎం  వైయ‌స్‌ జగన్‌ అన్ని మతాలను గౌరవిస్తారు: కురసాల కన్నబాబు. మాజీ మంత్రి:
– తిరుమలలో తొలి దర్శనం యాదవులకు కలిగిలే పునరుద్ధరణ చేశాం. మానవసేవే మాధవసేవ అని చెప్పే పార్టీ మాది. బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న పార్టీ. సునీల్‌ ధియోధర్‌ ట్వీట్‌ చాలా అవమానకరంగా ఉంది. సోము వీర్రాజుకు ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు. చంద్రబాబు హయాంలో 40 గుడులు కూల్చితే, అప్పుడు వారితో కలిసి అధికారం పంచుకున్న మీరు ఏం చేశారు? అందుకే  ఫ్యాబ్రికేటెడ్‌ ఉద్యమాలు చేద్దామనుకుంటే బీజేపీకి వర్కవుట్‌ కాదు. 

బీజేపీ దిష్టికళ్లతో చూడటం మానాలి:  బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. మాజీ మంత్రి:
– అన్నార్తులకు అన్నం పెడితే, దాన్ని కూడా మతం దృష్టిలో చూసే దిష్టి కళ్లు బీజేపీవి. దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే బీజేపీకి భక్తి గురించి ఏ మాత్రం తెలియదు. 

మతాలను తక్కువగా చూసే మనస్తత్వం బీజేపీది: గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నరసరావుపేట ఎమ్మెల్యే:
– సాయం చేస్తే సేవ. ద్రోహం చేస్తే పాపం.. అని బీజేపీ నేతలు తెలుసుకోవాలి. మా సీఎంగారు కానీ, మా పార్టీ కేడర్‌ కానీ అన్ని మతాలను సమానంగా చూస్తారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. అంతే కానీ, బీజేపీ నేతల మాదిరిగా మతాలను తక్కువగా చూసే మనస్తత్వం మాది కాదు. హిందుత్వాన్ని రాజకీయాలకు వాడుకునే స్వభావం మంచిది కాదు. 

మా నాయకుడికి అన్ని మతాలు సమానమే: గొడ్డేటి మాధవి. అరకు ఎంపీ.
– మా నాయకుడు, సీఎం  వైయస్‌ జగన్‌కు అన్ని మతాలు సమానమే. మతం పేరుతో బీజేపీలాగా రాజకీయాలు చేయడం మా జగనన్నకు కానీ, మాకు కానీ అలవాటు లేని పని.

హిందూ పండుగలతో బీజేపీకి రాజకీయాలు తగదు: వరుదు కళ్యాణి. వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ:
– మహాశివరాత్రి శుభాకాంక్షలను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న బీజేపీని రాష్ట్ర ప్రజలు అస్సలు ఆమోదించరు. అందుకే వారికి ఒక శాతం ఓట్లు కూడా ఇవ్వకపోవడం సబబేనని చెప్పాలి.

Back to Top