కొండాపురంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత బైక్‌కు నిప్పు

 కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తీరుపై నిరసన

 అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మండలం కొండాపురం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత ఆంజనేయులుకు చెందిన బైక్‌కు టీడీపీ నేతలు నిప్పు పెట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రలోభాలు, దౌర్జన్యాలకు తావులేకుండా ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. 

మ‌రోవైపు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దొడగట్ట గ్రామంలో రెండున్నరేళ్లుగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోని టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎన్నికల సమయంలో బోరు వేయించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మౌలిక సమస్యలను సకాలంలో పరిష్కరించకుండా ఎన్నికల వేళ హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. 

Back to Top