పరాకాష్టకు టీడీపీ అరాచకాలు

అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు

ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నాలు

ప్రజలంతా గమనిస్తున్నారు

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ప్రకాశం జిల్లా:పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.రాష్టవ్యాప్తంగా కూడా పోలీసులను అడ్డంపెట్టుకుని టీడీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందన్నారు.ప్రజాస్వామ్యంలో పార్టీ  కార్యాలయం కూడా ప్రారంభించుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు.వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జీ చేయడం అమానుషమన్నారు.చిత్తూరు జిల్లాలో ధర్నా చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి రాత్రి అంతా తిప్పి ఉదయం సత్యవేడు పోలీసుస్టేషన్‌లో ఉంచడం దారుణమన్నారు.

సుమారు 18 గంటలకు పైగా చెవిరెడ్డిని నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. చెవిరెడ్డి ఆరోగ్యం బాగోలేక బీపీ మాత్ర అడిగిన  ఇవ్వకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు.ప్రజలను భయభ్రాంతులను చేసి..ప్రతిపక్ష పార్టీల గొంతునొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాబోయే ఎన్నికల్లో ఇదే అరాచకం కోనసాగితే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.పచ్చనేతలకు కాపు కాస్తున్న పోలీసుల వ్యవహర శైలి మార్చుకోవాలని హితవు పలికారు.పోలీసుల అరాచకం పరాకాష్టకు చేరిందని, ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

Back to Top