వైయస్‌ఆర్‌ సీపీ నేత వేణుగోపాల్‌రెడ్డిపై పోలీసుల దాడి

 య్రరావారిపాలెం పీఎస్‌ ఎదుట ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధర్నా

తిరుపతి: పోలీసుల అరాచకాలు మితిమీరుతున్నాయని, టీడీపీ కార్యకర్తల్లా కొందురు పోలీసులు పనిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్‌ సీపీ నేత వేణుగోపాల్‌రెడ్డిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ య్రరావారిపాలెం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. వేణుగోపాల్‌రెడ్డిపై పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంట్లోకి ప్రవేశించి వేనుగోపాల్‌రెడ్డిని చిత్రహింసలకు గురిచేశారని, ఎందుకు కొడుతున్నారని అడిగిన వేణు తల్లిదండ్రులపై కూడా దాడికి దిగారన్నారు. పోలీసులు వేణుగోపాల్‌రెడ్డిని ఎక్కడకో తరలించారన్నారు. వెంటనే వేణుగోపాల్‌రెడ్డిని ఇంటికి చేర్చాలని, దాడి ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top