ఆళ్లగడ్డ: కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు ఒక సమయం వచ్చింది..ఇందుకోసం మనమంతా సిద్ధంగా ఉందామని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సీఎం వైయస్ జగన్ ప్రజలతో నేరుగా మాట్లాడటం ఈరోజే ప్రారంభిస్తున్నది కాదు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ జనం కోసం నిలబడినటువంటి ఒకేఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో, పాదయాత్రలో మన నుంచి విన్నారు దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ ఐదేళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్లీ వినడానికి వచ్చారు. పేదల కోసం పెత్తందారులందరితో యుద్ధం చేస్తున్నారు. ఈరోజు మన అక్కచెల్లెమ్మల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటు వంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న వినడానికి వచ్చారు. అన్న మీరు మాకోసం నిలబడ్డారు. ఇంటాబయటా నిందలు వేస్తున్నా సామాన్యుల జెండాను, అణగారినవర్గాల అజెండాను మోసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మా వంతు వచ్చింది. కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి మనకు ఒక సమయం వచ్చింది. సిద్ధమేనా మన అందరం.