చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారు

వచ్చేది రాజన్న రాజ్యం..

వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు.

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కుటుంబానికి, పోలవరానికి ఎంతో అవినాభవ సంబంధం ఉందని వైయస్‌ఆర్‌సీపీ పోలవరం అభ్యర్థి తెల్లం బాలరాజు అన్నారు. వైయస్‌ఆర్‌కు,వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోలవరం అంటే ప్రత్యేక అభిమానమని ఉందన్నారు.వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 2009లో ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గం చరిత్రలో ఏ అభ్యర్థికి రాని మెజార్టీతో పోలవరం నియోజకవర్గం ప్రజలు వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టారని తెలిపారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ హయాంలో పోలవరం నియోజకవర్గం రూపురేఖలు మారిపోయాయని,రికార్డు స్థాయిలో అభివృద్ధి జరిగిందన్నారు.పేద,బడుగు,బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు.2014లో చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలు నమ్మి  అన్నివర్గాల ప్రజలు మోసపోయారన్నారు.నేడు ఆ పరిస్థితి లేదని,ప్రజలందరూ చంద్రబాబు పాలన పట్ల విసిగిపోయారని తెలిపారు.

 

Back to Top