మంచి గెలవాలంటే.. వైయస్‌ జగన్‌ సీఎం కావాలి

చంద్రబాబు అబద్ధాల కోరు.. బంధువని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది

వైయస్‌ఆర్‌సీపీ నేత, సినీనటుడు మోహన్‌బాబు

నందిగామ: చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు అని వైయస్‌ఆర్‌ సీపీ నేత, సినీ నటుడు మోహన్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు బంధువని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందన్నారు. నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్ల మండలం ఆత్మూర్‌ గ్రామంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మొండితోక జగన్‌మోహన్‌రావు తరుఫున మోహన్‌బాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉచితంగా విద్యను అందించిన మహానుభావుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు.

ఆయన కుమారుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్నాడని, తొమ్మిది సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్నాడన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజురియంబర్స్‌మెంట్‌ వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే వైయస్‌ఆర్‌ ఆదర్శంగా నిలిచారన్నారు. తండ్రిలాగే అనుకున్నది సాధించే గుణం కలవాడు వైయస్‌ జగన్‌ అన్నారు. మంచి గెలవాలంటే వైయస్‌ జగన్‌ను గెలిపించాలన్నారు. ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 135 స్థానాలతో విజయం సాధిస్తారన్నారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొండితోక జగన్‌మోహన్‌రావు, ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. 

 

Back to Top