ఇద్దరి కొడుకులతో ప్రతిఫలం లేదని.. బాబే స్వయంగా..

మరో హాస్యాస్పద దీక్షకు సిద్ధమవుతున్నాడు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

అమరావతి: చంద్రబాబు చిన్న కొడుకుతో గుంటూరులో దీక్ష చేయించిన ప్రతిఫలం లేదని, పెద్ద కొడుకుతో విశాఖలో లాంగ్‌ మార్చ్‌ చేయించాడు.. వీరిద్దరితో కూడా ప్రతిఫలం లేదని తానే దీక్ష చేయడానికి సిద్ధపడ్డాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. నవ నిర్మాణ దీక్ష, ధర్మపోరాట దీక్షల్లాగా మరో హాస్యాస్పద దీక్షకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీల కబంధ హస్తాల నుంచి ఇసుకను బయటపడేయాలనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ ఇసుకలో నూతన పాలసీ తీసుకువచ్చారన్నారు. పాలసీ అమలు అవుతున్న తరుణంలో ప్రకృతి సహకరించి వర్షాలు విపరీతంగా కురిసి వరదలు వచ్చి నదులు పొంగిపొర్లుతున్నాయన్నారు. ఇసుక అనే అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ప్రభుత్వ తప్పిదంగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శక పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు చిన్న కొడుకు గుంటూరుల దీక్ష చేస్తే ప్రతిఫలం లేదని, పెద్ద కొడుకుతో విశాఖలో మార్చ్‌ చేయించాడని, వీరిద్దరితో కాదనే తానే 14వ తేదీన చంద్రబాబే దీక్షకు దిగుతున్నాడన్నారు. నవ నిర్మాణ దీక్ష.. ధర్మపోరాట దీక్షల్లా మరో హాస్యాస్పద దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నాడని ఎద్దేవా చేశారు. దీక్ష చేయడం వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. ఇసుక కొరత తీర్చేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నవంబర్‌ 6 రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుందని, ప్రజా సంకల్పయాత్ర రాష్ట్రంలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించిందన్నారు.  

Read Also: చంద్రబాబు మెయిన్‌ విలన్‌..పవన్‌ సైడ్‌ విలన్‌ 

 

తాజా ఫోటోలు

Back to Top