వచ్చేది రాజన్న రాజ్యమే..

టీడీపీకి ఓటమి భయం

ఎన్నికల ముందు చంద్రబాబు కపట నాటకాలు

వైయస్‌ఆర్‌సీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

కర్నూలు: జిల్లాలో 14 నియోజకవర్గాలను గెలుస్తామని వైయస్‌ఆర్‌సీపీ పాణ్యం అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు.ఆయన పాణ్యంలో మీడియాతో మాట్లాడారు.చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు.వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారన్నారు.టీడీపీ నాలుగున్నర సంవత్సరాల పాలనలో ప్రజల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి కపట నాటకాలు ఆడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో వచ్చేది వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే అని «ధీమా వ్యక్తం చేశారు.

 

Back to Top