విశాఖ: ప్రాంతీయ విభేదాలకు ఆస్కారం లేకుండా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి ఎక్కడికి వెళ్ళలేదు..నారాయణ కాలేజీలతో పాటు అమరావతి అక్కడే వుంటుంది. విశాఖ పరిపాలనతో పాటు ఆర్థిక రాజధానిగా మారుతోందన్నారు. సీఎం రమేష్ మీరు బీజేపీ నా లేక టీడీపీనా ముందు చెప్పాలని డిమాండు చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు..అమరావతి అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం అమరావతి తో పాటు అన్ని ప్రాంతాలను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నారు. చంద్రబాబు ను కుప్పం ప్రజలే వెళ్లిపొమంటున్నారు. చంద్రబాబు చేసిన రెండు లక్షల కోట్లు అప్పు ఈ ప్రభుత్వం తీరుస్తోంది. దేశంలో వేలాది మంది వలస కార్మికులు కరోనా సమయంలో చనిపోతే ఏపీ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కరోనా మహమ్మారి వేళ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పారాసెటమాల్ వేయమంటే నవ్వారు..ఇప్పుడు అదే ప్రోటోకాల్ టాబ్లెట్ అయ్యిందని జూపూడి ప్రభాకర్ గుర్తు చేశారు.