చంద్రబాబు చేస్తున్నది సిగ్గుచేటు 

అప్పు తెచ్చిన డబ్బును చంద్రబాబు ఏం చేశారు? 

ఉద్యమానికి ఇంటికొకరు రమ్మని పిలవడం దేనికి సంకేతం

విశాఖకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది?

విశాఖ రాజధానిగా ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు:

వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు 

విశాఖపట్నం: చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన అప్పులు ఏం చేశారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో జోలి పట్టి అడుక్కోవడం సిగ్గు చేటు అన్నారు. విశాఖకు వ్యతిరేకంగా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రతిదానికి వైయస్‌ జగన్‌ను అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.  ఇతర రాష్ట్రాలు ఏపీని చూసి నవ్వుతున్నాయంటున్నాడు.. ఆంధ్రప్రదేశ్‌ను కాదు చంద్రబాబును చూసి నవ్వుతున్నాయి. చంద్రబాబుకు ఇంకా సిగ్గు రాలేదు. మోడీతో విభేదించి కాంగ్రెస్‌తో కలిసిపోయి ఇక్కడ సంపాదించిన కొంత డబ్బును ఆ జాతీయ పార్టీలకు ఫండ్‌ కింద ఇచ్చి మోడీని పడగొడదామని ప్రయత్నం చేస్తే చంద్రబాబుతో కలిసినందుకు వాళ్లు కూడా ఓడిపోయారు.. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. రాజధాని పేరుతో మన రాష్ట్రంలో ఆందోళనలు సృష్టిస్తున్నాడు. రాజ్యాంగ పరమైన పదవులను చేసిన వ్యక్తి ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రాజ్యాంగ, ప్రజాస్వామిక విధానాలు ఉన్నాయి. శాసనసభ కమిటీలకు రిప్రజెంట్‌ చేయొచ్చు..
150 మంది సమాధానం చెప్పగలను నేను ముసలివాడిని కాదు ఖబడ్దార్‌ అంటున్నాడు. చెప్పండి.. శాసనసభలో ఈబిల్లు పెడతారు ఏం పెడతారో తెలియదు.. తెలియకుండానే ఆందోళనలు చేస్తున్నాడు. సభలో బిల్లు పెట్టినప్పుడు అభ్యంతరాలు ఉంటే 150 మందిని వ్యతిరేకిస్తూ మాట్లాడండి. తరువాత కౌన్సిల్‌ ఉంది.. టీడీపీకి మెజార్టీ ఉంది కౌన్సిల్‌లో సలహా ఇవ్వండి. మళ్లీ మార్పులు చేయడానికి సీఎం సిద్ధంగా ఉంటారు. సలహాలు ఇవ్వాలని ఆహ్వానిస్తే.. జై అమరావతి అనుకుంటూ మెడలో కండువా వేసుకొని రోడ్ల మీదపడి జోలె పట్టుకొని భిక్షాటన చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల్లో బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు. ఇంకా డబ్బు సంపాదన కోసం భిక్షాటన చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సిగ్గుచేటు.
అప్పుడు కూడా అమరావతి కడతానని ఒక్కో ఇటుకకు రూ. వెయ్యి ఇవ్వమన్నారు. వసూలు చేసిన సొమ్ము లెక్కల్లో చూపించారా..? విరాళాలు ఇచ్చిన సొమ్ము ఖర్చు చేశామని కరపత్రం అచ్చువేశారా..
అధికారంలో ఉన్నా.. లేకున్నా డబ్బు వసూలు మీద పడ్డారు. ప్రాంతీయ విభేదాలు తీసుకువస్తున్నాడు. రాజధాని మీద ఎన్నికలకు రండి అంటున్నాడు.. రాజధాని మీద ఎన్నికలకు వస్తాం.. నాలుగున్నరేళ్ల తరువాత వస్తాం. వైయస్‌ జగన్‌ నిర్ణయాల మీద ప్రజల తీర్పు కోరుతాం. ఇలాగే ప్రవర్తిస్తే 23 కాదు మీరు గెలవడం కూడా కష్టమే.
ప్రజలు ఇచ్చిన తీర్పును ఏం గౌరవిస్తున్నారు. మీ ఆలోచనల ప్రకారం ప్రభుత్వం నడవాలని అనే హక్కు ప్రజాస్వామ్యంగా ఉందా..? ఇంటికి ఒకరు రండి.. అమరావతిని కాపాడుకుందాం అంటున్నాడు.. మీరేమైనా బకాసురుడా.. బకాసురుడు రోజుకు ఒకడిని తిన్నాడు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తాలూకూ జీవితాలను నాశనం చేయడానికి ఇంటికి ఒకరు రండి అంటున్నారు. జగన్‌ నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. రేపు వచ్చే ఉద్యోగాల భర్తీకి అవకాశం లేకుండా యువత భవిష్యత్తును పాడుచేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
చంద్రబాబు పెద్ద అబద్దాల కోరు. రాజధాని విశాఖలో ఉంటే బాగుంటుందని ప్రజలంతా అంటుంటే చంద్రబాబు ఒక్కడే వ్యతిరేకిస్తున్నాడు. కబ్జాలపై ఏం చర్య తీసుకున్నారు. సిట్‌ రిపోర్టును చెత్తబుట్టలో వేశారు. అరాచక శక్తులు వస్తున్నాయంటున్నాడు.. ఉత్తరాంధ్ర ప్రజలు అవసరం వస్తే తిరిగబడతాం. అమరావతిలో ఒక్క శాశ్వత భవనం అయినా నిర్మించారా..? కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారు. అన్నిరకాలుగా డబ్బు ఉండి కూడా రాజధాని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. మూడు పంటలు పండే భూములను రైతుల దగ్గర నుంచి లాక్కొని ల్యాండ్‌ పూలింగ్‌ పేరు పెట్టి రైతులను మూడేళ్లుగా రోడ్డు మీద పడేశారు. 33 వేల ఎకరాల్లో 1000 ఎకరాల్లో మాత్రమే పనులు చేశారు. కనీసం ఆ రైతులు ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి చర్చ చేయకుండా, ప్రభుత్వంతో విరోధం తయారు చేసి ఏం సాధిస్తారు. ఇది పద్ధతేనా.. మీరే నిజమైన రాజకీయ నాయకుడు అయితే ముఖ్యమంత్రి వద్దకు ఓ ప్రతినిధిని పంపించి ఏం చేయబోతున్నారని ఎందుకు చర్చ జరపడం లేదు.. వాళ్లకు ఉపకారం జరగకూడదు.. వాళ్లు నాశనమై రోడ్డు మీదపడి ఆకలి చావులు చావాలని చంద్రబాబు కుట్ర. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చ్రందబాబు చేస్తున్న కార్యక్రమాలు తప్ప.. ఎవరి ప్రయోజనాల కోసం ఆయన చేయడం లేదు.
ఓ పత్రికాధిపతిని కోరుతున్నాను. ఏడు భవనాలను పేపర్‌లో వేసి మొత్తం అయిపోయినట్లుగా చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా..? విశాఖపట్నం కాదని అంత భుజాన ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటీ..? మీ పేపర్‌ను మొదటిసారిగా విశాఖపట్నంలో పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖలోనే పెట్టారు. ఇక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించారు. మీ ఎదుగుదలకు కారణం విశాఖ. మీ తాలూకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో సభ్యులం, మీ ప్రియా పచ్చళ్లు తింటున్నాం. మీకు మేము చేసిన అపకారం ఏంటీ..?
ఇన్నాళ్లకు ఒక సెక్రటేరియట్‌ ఇస్తానని ప్రతిపాదిస్తే.. నిర్ణయం రాకముందే ఎందుకు హైరానా పడుతున్నారు. ప్రజలను మభ్యపెట్టడం మోసం చేయడం కాదా..? దయచేసి చంద్రబాబు ప్రయోజనాల కోసం ఇంకా మీ పేపర్‌ పనిచేసేలా చూడకండి.. రాష్ట్ర ప్రయోజనాలు చూడండి. ఈ రాష్ట్రంలో మీము కూడా భాగస్వాములమే.. రాయలసీమ వారు కూడా భాగస్వాములే. అందరూ ఈనాడు పేపర్‌ను ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలను మీరు వ్యతిరేకిస్తూ.. మీ పేపర్‌ దాని కోసం పనిచేస్తే దాన్ని ఎవరూ హర్షించరని, మీ పేపర్, మీ టీవీల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఇంకా కుళ్లు రాజకీయాలు ఎందుకండి. చంద్రబాబును పట్టుకొని ఏడుస్తారేంటీ.. అప్రతిష్టపాలైన నాయకుడిని వెంటపడాల్సిన అవసరం మీకు ఏమోచ్చింది.. ఆయనతో పాటు మీరు మునిగిపోవడానికా..న్యాయబద్ధంగా, వాస్తవాలు రాసే విధంగా సూచనలు చేయాలని కోరుతున్నాను.

నారాయణలో నారా ఉందని కమిటీకి చైర్మన్‌ను చేశారు. ఆయన ఏది చెబితే అది బాబుకు వేదం. మీ రియలెస్టేట్‌ వ్యాపారానికి నారాయణ బ్రోకర్‌. కాబట్టే ఆయన్ను కమిటీ వేసి 32 వేల ఎకరాలను, చుట్టుపక్కల భూమిని ఆక్రమించాలని కమిటీ వేశారు. బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూపు ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. దాన్ని బోగస్‌ గ్రూపు అంటున్నారు. ఐక్యరాజ్యసమితిలో వారు కూడా కొన్ని నిర్ణయాలను తీసుకొని వెస్ట్‌ ఆఫ్రికాలో ఎబోలా అనే వైరస్‌ వచ్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి మరణాలు ఎక్కువైపోయేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి బోస్టన్‌ గ్రూపును ఆహ్వానించి స్టడీ చేయించి రిపోర్టు తీసుకుందని చంద్రబాబుకు తెలియదేమో..

Back to Top