చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలు

ప్రచారం పేరుతో పచ్చి అబద్ధాలు

చంద్రబాబు ఆలోచనలు దుర్మార్గం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య

 

తిరుపతి:ఎన్టీఆర్‌తో పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీని తన పేరుతో మార్చుకోవాలని చంద్రబాబు ఆలోచన దుర్మార్గం అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు.తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా పథకం తానే ప్రవేశపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నాడని..అసలు డ్వాక్రా పథకం కాన్సెప్ట్‌ను ప్రధానిగా ఉన్నప్పుడు పివి నరసింహరావు తీసుకువచ్చారన్నారు. డ్వాక్రాను బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్‌ యూనిస్‌ అనేవ్యక్తి రూపొందించారన్నారు.ఆయనకు నోబెల్‌ ప్రైజ్‌ కూడా ఇచ్చారన్నారు. చంద్రబాబు సిగ్గులేకుండా తన స్కీం అని చెప్పకుంటున్నాడని  విమర్శించారు.  వైయస్‌ఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల  మనసులో నాటుకుపోయారు.

ప్రజలు వైయస్‌ఆర్‌ను దేవుడిలా చూశారు. వైయస్‌ఆర్‌ ఎన్నడూ రౌడీరాజ్యం నడపలేదన్నారు.భూములు కబ్జా చేయలేదు,ఎవరిని మర్డర్లు చేయించలేదు. అవన్ని చంద్రబాబు నాయుడే చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వైయస్‌ఆర్‌పై దుష్ఫ్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఏమి జరిగిన తన ప్రమేయంతోనే జరిగిందని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యస్పదమన్నారు. చంద్రబాబు..2004 ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి మహిళలను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేశాడని..మహిళలు చంద్రబాబును ఓడించారన్నారు.

మహిళలకు పావలా వడ్డీలు ఇచ్చింది వైయస్‌ఆర్‌. వేరేవాళ్లవి చంద్రబాబు కాపీ కొట్టి తనవిగా చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు.ప్రచారం పేరుతో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.ప్రజలకు అమలు చేసిన చంద్రబాబు సొంత స్కీం ఒకటి కూడా లేదన్నారు.హౌసింగ్‌ స్కీంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అంతా పెట్టుకుందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని,ఇందులో కేంద్రం ఇచ్చే వాటా చాలా ఎక్కువ ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నిధులే తప్ప..సొంత నిధులు ఎక్కువగా లేవన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిధులను చంద్రబాబు దుబారా ఖర్చుచేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ఇచ్చిన నిధులతోనే నిర్మిస్తున్నారన్నారు.

Back to Top