వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే సమసమాజం..

వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ...

విజయవాడ: ఈనెల 17న ఏలూరులో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలో భారీ బీసీ బహిరంగ సభ నిర్వహిస్తునట్లు వైయస్‌ఆర్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.గుంటూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన బీసీ అధ్యయన కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సభలో బీసీల కోసం వైయస్‌ఆర్‌సీపీ అమలు చేసే సంక్షేమ కార్యక్రమాల వివరాలను వైయస్‌ జగన్‌  ప్రకటిస్తారని తెలిపారు.ఈ సభ ద్వారా రాష్ట్రంలోని బీసీ వర్గాలను రోబోయే కాలంలో ఎలా ఆదుకోవాలనే పార్టీ విధానాలను ప్రకటిస్తామన్నారు. 

బీసీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్తు తెలిపారు. సామాజికంగా బీసీలకు గుర్తింపునిచ్చి, సమసమాజం నిర్మాణంలో భాగస్వాములను చేయడానికి కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు.  ప్రజలను మోసం చేసి చంద్రబాబు ఢిల్లీలో కొంగ జపాలు చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ అప్పుడు ప్రత్యేకహోదా అడగకుండా ప్యాకేజీ కోరిన చంద్రబాబు..నేడు ప్రత్యేకహోదా కావాలంటూ దొంగదీక్షలు చేస్తున్నారన్నారు.ప్రత్యేకహోదా కావాలని మొదటి నుంచి చిత్తశుద్ధితో వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.

 

Back to Top