వైయస్‌ జగన్‌కు పదవుల కంటే ప్రజలే ముఖ్యం

వైయస్‌ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్‌

విశాఖలో వైయస్‌ఆర్‌సీపీ నేతల ఆత్మీయ సమ్మేళనం

గెలిపించిన నేతల భూములు కబ్జా చేసే చరిత్ర గంటాది

గంటా నా సీటు ఎత్తుకుపోయారు 

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పదవుల కంటే ప్రజలే ముఖ్యమని..అందుకే కేంద్ర మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్‌ ఆ నాడు చెప్పినా ప్రజల కోసం నిలబడ్డారని వైయస్‌ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కీలక నేతలు వైయస్‌ఆర్‌సీపీలోకి వస్తారని జోస్యం చెప్పారు.  శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విశాఖలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ, మాడుగుల ఎమ్మెల్యే ముత్యాలనాయుడు, విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, సమన్వయకర్తలు సత్యనారాయణ, అప్పలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్, అదిప్‌రాజ్, కరుణం ధర్మశ్రీ, కన్నబాబు, కొయ్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. భీమిలీ నియోజకవర్గాన్ని గంటా ఏం అభివృద్ధి చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. తనకు గత ఎన్నికల్లో సీటు ఇప్పిస్తానని చెప్పి..ఆ సీటును గంటా ఎత్తుకెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని, ప్రతి ఒక్కరూ వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ సీఎం కావాలి: బొత్స
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని..దేశంలో ఏ నేత చేయని విధంగా వైయస్‌ జగన్‌ పాలన ఉంటుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. ఐదేళ్లలో భూ కబ్జాలు తప్ప టీడీపీ నేతలు ఏం చేయలేదని విమర్శించారు. కలెక్టరేట్‌లో భూ రికార్డలు చూస్తేనే గంటా స్కామ్‌లు తెలుస్తాయన్నారు.  మంత్రి గంటా శ్రీనివాస్‌ రాజకీయాలు ముగింపునకు వచ్చాయని పేర్కొన్నారు. దేశంలో ఏ నేత చేయని విధంగా వైయస్‌ జగన్‌ పాలన ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వ్యవస్థను నాశనం చేస్తున్న దృష్టశక్తులకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. 

తాజా వీడియోలు

Back to Top