చంద్రబాబు ఈ పశ్నలకు సమాధానం ఉందా?

వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు

హైదరాబాద్‌: డేటా చోరి కేసు నేపథ్యంలో చంద్రబాబు నేడు ఒంటిగంటకు నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. తెలుదేశం పార్టీ వెబ్‌సైట్‌ను,సేవా మిత్ర యాప్‌ను ఎందుకు క్లోజ్‌ చేశారని ప్రశ్నించారు.  వెబ్‌సైటు కూడా క్లోజ్‌ చేశారంటే దొంగ ఎవరనేది స్పష్టమవుతుందన్నారు. బుకాయించి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదన్నారు. ఓటుకు నోటుకు కేసులో మరో  వీడియో బలం చేకూరుస్తుందన్నారు. చంద్రబాబు తను చేస్తున్నా  తప్పులను బయటకు రాకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భూజాలు ఎందుకు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 

 

 

Back to Top