మేడా చేరిక వైయస్‌ఆర్‌సీపీకి బలం

వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
 

హైదరాబాద్‌: టీడీపీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి  చేరికతో వైయస్‌ఆర్‌సీపీకి బలం చేకూరుతుందని వైయస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో నాకు ఎలాంటి విభేదాలు లేవని ఆకేపాటి స్పష్టం చేశారు. టికెట్‌ ఎవరికి ఇస్తారనేది హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. తాను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని స్పష్టం చేశారు. 
 

Back to Top