టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు బాదుడే బాదుడు

 మూడున్నరేళ్లు కనపడని కేశవ్ వీధి నాటకాలు వేస్తున్నాడు
 

దుష్ప్రచారమే లక్ష్యంగా గ్రామాలకు వెళుతున్నారు

 అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు మరోసారి బాదుతాడు

వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త వై. విశ్వేశ్వరరెడ్డి 

ఉరవకొండ:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి సంక్షేమ పాలనలో ఎక్కడ కనుమరుగు అవుతామనే భయంతో తమ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిర్వహిస్తున్నారని ఉరవకొండ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త వై. విశ్వేశ్వరరెడ్డి  విమర్శించారు. శుక్రవారం కూడేరు మండలం మరుట్ల-2 కాలని గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జెడ్పి చైర్ పర్సన్ గిరిజమ్మ, ఎంపీపీ నారాయణరెడ్డి, అగ్రి అడ్వైజరి బోర్డు చైర్మన్ నిర్మలమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ సుశీలమ్మ, వైస్ సుబ్బమ్మ,ప్రచార కార్యదర్శి బైరెడ్డి రామచంద్రారెడ్డి, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ ఓబులమ్మ, నాయకులు హరీష్ ,నీలకంఠరెడ్డి, పరమేశ్వరరెడ్డి, మధుసూదన్ రెడ్డి ,అధికారులు  హాజరయ్యారు.

ముందుగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేయడంతో తెదేపా నాయకులకు కంటగింపుగా మారిందన్నారు. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ గ్రామాలకు వెళ్లి బురద జల్లే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే గా గెలిచి మూడున్నరేళ్లు కంటికి కనిపించని కేశవ్ ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ గ్రామాల్లో తిరగడం విడ్డురంగా ఉందన్నారు. నీ ఈ ముడున్నరేళ్ల కాలం లో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఒక్క మంచిపనైనా చూసావా కేశవ్ అని ప్రశ్నించారు. కేవలం వీధి నాటకాలు వేయడం తప్ప ఇంకోటి లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వ అభిమతమని, పేదలందరికీ కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం వైయ‌స్  జగన్‌ లక్ష్యమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు ,దుష్ప్రచారాలు మానుకోకపోతే ప్రజలు 2019 లో లాగే మిమ్మల్ని మరోసారి బాదుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కో అప్షన్ మెంబర్ సర్ధార్ వలి, వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు నాగరాజు, ఈశ్వర్ రెడ్డి, రాము, పురుషోత్తం ,బయ్యపు రెడ్డి, ఎర్రిస్వామి, వేణు గోపాల్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, జల్లిపల్లి సిద్దారెడ్డి, మంజునాథ్ రెడ్డి, జల్లిపల్లి దేవేంద్ర, వడ్డే గంగాధర్, ఎర్రనాగప్ప, సర్పంచులు అక్కులప్ప, చంద్రశేఖర్, డీలర్ సీనా, రామన్న, శంకరయ్య, చత్రానాయక్, గంగాధర్, జయపురం శంకర్ రెడ్డి, ఇప్పేరు తిమ్మారెడ్డి,శ్రీనివాసులు నాయుడు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Back to Top