వైయస్‌ఆర్‌సీపీ ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు..

గ్రామాల్లోకి వస్తే టీడీపీ నేతలకు భయమెందుకు..?

వైయస్‌ఆర్‌ జిల్లా:అధికార టీడీపీ పార్టీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరుగుతుపోతున్నాయి.ఇష్టారాజ్యంగా  దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. జమ్మల మడుగు మండలం సున్నపురాళ్ల పల్లిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రచారాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్తితులు నెలకొన్నాయి. గ్రామంలో  40 కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరాయి. వైయస్‌ఆర్‌సీపీ నేతలు అవినాష్‌ రెడ్డి, సుధీర్‌రెడ్డిలు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వైయస్‌ఆర్‌సీపీ నేతలు అవినాష్‌ రెడ్డి,సుధీర్‌ రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి తీసుకుని గ్రామంలో ప్రచారానికి వెళ్లామని టీడీపీ నేతలు అడ్డుకోవడం దారుణమన్నారు.అభివృద్ధి అంతా వైయస్‌ఆర్‌ హయాంలోనే జరిగిందని, చంద్రబాబు పాలనలో అరాచకమే తప్ప సంక్షేమం శూన్యమన్నారు.ప్రజలు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.గ్రామంలో ఎంతమందికి ఉద్యోగాలు,పింఛన్లు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు.గ్రామంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు.వైయస్‌ఆర్‌ నిర్మించిన గృహాలు తప్ప అదనంగా ఏమీ జరగలేదన్నారు.సున్నపు రాళ్లపల్లి గ్రామస్తులు మాకు అపూర్వ స్వాగతం పలికారన్నారు.కొంతమంది టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.వైయస్‌ఆర్‌సీపీ నేతలు గ్రామాల్లోకి వస్తే టీడీపీ నేతలకు భయమెందుకని ప్రశ్నించారు.ఆదినారాయణ రెడ్డి చెందిన గ్రామాల్లో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటామన్నారు.ఈ గ్రామంలో గడచిన నాలుభై ఏళ్లుగా  పోలింగ్‌ జరగలేదన్నారు.కొందరికి ఓటు హక్కు కూడా లేకపోవడం దారుణమన్నారు.గ్రామంలో ప్రచారం కూడా చేసుకోనివ్వకుండా టీడీపీ నేతలు రౌడీలా పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు.

తాజా వీడియోలు

Back to Top