మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఐదుగురు మృతి విషాదకరం

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత  వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి: కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు మృతిచెందిన విషాదకర ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.

Back to Top