తాడేపల్లి: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వికెట్‌కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్‌కు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఒక ముఖ్యమైన మలుపు అని పేర్కొన్నారు. దేశం కోసం ఆయన అందించిన సేవలను అభినందిస్తూ, క్రికెట్‌లో ఆయన చేసిన కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. క్రికెట్ కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న కేఎస్ భరత్‌కు భవిష్యత్తులో అన్ని రంగాల్లో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. “అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న కేఎస్ భరత్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు, సంతోషాలు మీ సొంతం కావాలని కోరుకుంటున్నాను” అని వైయస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.